Spam Calls:హాయిగా ఉంటుంది:ఇక నుంచి మార్కెటింగ్ ఫోన్స్కాల్స్ ఉండవు

Spam Calls:హాయిగా ఉంటుంది:ఇక నుంచి మార్కెటింగ్ ఫోన్స్కాల్స్ ఉండవు

మార్కెటింగ్ కాల్ష్ నియంత్రణకు కొత్త రూల్స్ తీసుకొస్తుంది ట్రాయ్.. ఇటీవల స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి..అవసరమైన కాల్స్ కంటే అనవసరమైన మార్కెటింగ్ కాల్సే ఎక్కువయిపోయాయి. పొద్దున లేచింది మొదలు స్పామ్ కాల్స్, మెసేజ్ లతో కస్టమర్ల చెవుల తుప్పు వదులుతోంది.స్పామ్ కాల్స్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి పెద్ద సవాల్గా మారింది. 

వీటిలో ఎక్కువ శాతం కాల్స్..మార్కెటింగ్ కు సంబంధించినవి.సైబర్ స్కామర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కాల్స్ ను నియంత్రించకపోతే ముఖ్యమైన కాల్స్ ను మిస్ కావాల్సి వస్తుందని టెలికాం కస్టమర్లు ఇప్పటికే వారిక టెలికా ఆపరేటర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. 

స్పామ్ కాల్స్.. ముఖ్యంగా మార్కెటింగ్ కాల్స్ నియంత్రించేందకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొస్తుంది.ఇప్పటివరకు స్పామ్ కాల్స్ నియంత్రణకు యూజర్లు టెలికం ఆపరేటర్లు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేంది. ఇకనుంచి స్వయంగా మార్కెటింగ్ కాల్స్ ను నియంత్రించేవిధంగా ట్రాయ్ అవకాశం కల్పిస్తోంది. 

ALSO READ | మొబైల్స్​​ మన మాటలు వింటాయా?..

మార్కెటింగ్ కాల్స్ నియంత్రణపై టెలికాం మినిస్టర్ జోతిరాధిత్య సింధియా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో మార్కెటింగ్ కాల్స్ తాకిడి ఎక్కువైపోయింది.. మార్కెటింగ్ కంపెనీల తమ నంబర్లు ఇవ్వొద్దని కస్టమర్లు వారి టెలికం ఆపరేటర్లకు ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలావున్నాయి.. మార్కెటింగ్ స్పామ్ కాల్స్ ను నియంత్రించడంలో టెలికాం ఆపరేటర్లదే బాధ్యత..వినియోగదారులది కాదు.

ఈ విషయంలో ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది. మార్కెటింగ్ కాల్స్ కావాలి అని కస్టమర్లు అడిగితేనే.. టెలికం ఆపరేటర్లు వారి నంబర్లు ఇవ్వాలని అన్నారు. మార్కెటింగ్ కాల్స్, స్పామ్ కాల్స్ పెరుగుతున్న క్రమంలో కస్టమర్లు ట్రాయ్ నిబంధనలు ఉపశమనం కలిగిస్తాయని జోతిరాధిత్య సింధియా అన్నారు.