ఫార్మసీ కాలేజీ భూముల ఆక్రమణలకు ఇక అడ్డుగోడ.. ప్రహరీ నిర్మాణానికి రూ. 2.85 కోట్లు మంజూరు

ఫార్మసీ కాలేజీ భూముల  ఆక్రమణలకు ఇక అడ్డుగోడ.. ప్రహరీ నిర్మాణానికి రూ. 2.85 కోట్లు మంజూరు
  • టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభం
     
  • గతంలో కోట్లాది రూపాయల విలువైన భూమి కబ్జాకు యత్నం 
  • యూనివర్సిటీ స్థలాలను కబ్జా కానివ్వం: వీసీ

కరీంనగర్, వెలుగు: ఎల్ఎండీ సమీపంలోని శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ భూముల పరిరక్షణకు ముందడుగు పడింది. గతంలో ఈ కాలేజీ పక్కనే భూములు కలిగిన పలువురు వ్యక్తులు భూఆక్రమణకు యత్నించడంతో కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలేజీ భూములు కబ్జాకు గురికాకుండా ప్రహరీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.85 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు చేపట్టేందుకు ఆర్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ శాఖ శుక్రవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న టెండర్ ప్రక్రియ ముగిశాక త్వరనేలోనే పనులు ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ స్థలాలను కబ్జా కానివ్వమని స్పష్టం చేశారు.  

42.14 ఎకరాల్లో ఫార్మసీ కాలేజీ ఏర్పాటు

ఎల్ఎండీ సమీపంలోని శాతవాహన వర్సిటీ ఫార్మసీ కాలేజీ 42.14 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు. ఇందులో ఏడేళ్ల కింద మౌలానా అబుల్ కలామ్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)కి 5 ఎకరాలు, సైన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 ఎకరాలు కేటాయించారు. ఇప్పటిదాకా వాటికి సంబంధించిన పనులు ప్రారంభించలేదు. మరో 1.5 ఎకరాలు సెంట్రల్ ఇండస్ట్రియల్ టూల్స్ & డిజైన్(సీఐటీడీ)కి కేటాయించగా.. ఈ నిర్మాణం పూర్తయింది. మిగతా 30.04 ఎకరాలు ఫార్మసీ కాలేజీ ఆధీనంలోనే ఉన్నాయి. 

ప్రహరీ లేకపోవడంతో ఈ భూములను కొద్దికొద్దిగా ఆక్రమించేందుకు పలువురు రియల్టర్లు, పక్కభూమి ఓనర్లు యత్నించడంతో అప్పడు రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ప్రస్తుత వీసీ ఉమేశ్ కుమార్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వీసీ టి.చిరంజీవులు ప్రహరీ, హాస్టల్స్, ఇతర బిల్డింగ్స్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రహరీ నిర్మించకపోవడంతో కబ్జాదారుల పని ఈజీ అయింది. 

దీంతో కాలేజీ చుట్టూ భూమి ఉన్న ప్రైవేట్  వ్యక్తులు ఆక్రమణలకు యత్నించారు. ఈ క్రమంలోనే నిరుడు జనవరి 4న ఓ వ్యక్తి తన స్థలాన్ని చదును చేసి.. జేసీబీతో ఫార్మసీ కాలేజీ భూమిలోకి ప్రవేశించి చదును చేయించాడు. కాలేజీకి చెందిన షెడ్డు కూల్చివేయించాడు. మరుసటి రోజు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  గతంలో తాను రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు ప్రతిపాదన దశలో ఆగిపోయిన ప్రహరీ పనులను.. వీసీ ఆయ్యాక ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించబోతుండడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం
 చేస్తున్నారు. 

సర్వే చేస్తారా.. కనీలు పాతిన చోటనే కట్టేస్తారా..? 

గతేడాది పక్క భూమి వ్యక్తి కాలేజీ స్థలాన్ని చదును చేయించడంతో హద్దులు చెదిరిపోయాయి. ఫార్మసీ కాలేజీ భూమి ఎక్కడి వరకు ఉందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. సర్వేయర్ తో హద్దులను నిర్ధారించి కనీలు పాతాల్సి ఉండగా... అప్పటి వీసీ ఆదేశాలతో అధికారులు తమకు తోచిన చోట పాతారు. కబ్జాదారులకు కొంత స్థలం వదిలేసే కనీలు పాతారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇదే విషయమై అప్పట్లో ఓ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగితే.. వారిపైనే యూనివర్సిటీ ఆఫీసర్లు కేసులు పెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా మళ్లీ సర్వే చేశాక ప్రహరీ నిర్మిస్తారా.. లేదా అనేది వేచి 
చూడాల్సి ఉంది.