ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో దీంతో రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని నిర్ణయించింది. గత నెలలో కరోనా కేసులు భారీగా పెరగడంతో జగన్ సర్కార్... కరోనా నిబంధనలు విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు కూడా అమలు చేసింది. అందులో భాగంగా రాత్రి వేళ కర్ఫ్యూ విధించింది ఏపీ సర్కార్. అయితే.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ ఫిబ్రవరి 14న సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నియంత్రణ,వాక్సినేషన్, ఆస్పత్రుల్లో నాడు నేడుపై సీఎం సమీక్ష జరిపారు.
ఇందులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ,సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళ ఉన్న కర్ఫ్యూ ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే నైట్ కర్ఫ్యూ తీసేసిన... జనం మాత్రం తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే కొనసాగించాలన్న సీఎం జగన్ ఆదేశించారు. లక్షణాలు ఉన్న వారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖపై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకన్నారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు సీఎం జగన్.