ఇకనుంచి ఆన్ లైన్ లావాదేవీలకు OTP లు ఉండవా..టెలికం కంపెనీలను నుంచి సర్వీస్ మెసేజ్ లు ఉండవా.. అంటే ఇటీవల ట్రాయ్ కొత్త నిబంధనలు అదే చెబు తున్నాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, ఈ కామర్స్ ప్లాట్ ఫాం ల ద్వారా లావాదేవీలకు సంబంధించిన OTP లను రద్దు చేయాలని ఇటీవల ట్రాయ్ కొత్త రూల్స్ ప్రతిపాదనలు టెలికం కంపెనీలకు పంపించింది. ఈ కొత్త రూల్స్ నవంబర్ 1 నుంచి అమలు చేసేందుకు సిద్దమవుతోంది.. అయితే ప్రముఖ టెలికం కంపె నీలు అయిన ఎయిర్ టెల్, జియో లతో సహా అన్ని సంస్థలు ఈ కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. కస్టమర్లకు ఇష్టారాజ్యంగా వస్తున్న అన్ వాంటెడ్ మెసేజ్ లు , ఓటీపీలను టెలికం కంపెనీలు బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎయిర్ టెల్, జియో లాంటి ప్రముఖ టెలికం సంస్థలు కొత్త నిబంధనల అమలుకు కొంత సమయం కోరుతున్నాయి.
ALSO READ | జాగ్రత్త : కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు
ఆగస్టు 2023 నాటికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలనుంచి మేసేజ్, OT Pల నియంత్రణ చేయాలని గతంలోనే టెలికం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. నవం బర్ 2024 సమీస్తున్నప్పటికీ టెలికాం కంపెనీలు , టెలిమార్కెటర్లు స్పందించలేదు. దీంతో మరోసారి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్త నిబంధనల అమలుకు 2 నెలల సమయం టెలికం కంపెనీలు కోరుతున్నాయి.
ఈ లోపు తమ ఆపరేటింగ్ సిస్టమ్ లను అప్డేట్ చేసుకుంటామని తెలిపాయి. ట్రాయ్ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే కస్టమర్లకు అనవసర OTP, లావాదేవీల మేసేజ్ ల నియంత్రణలో ఊరట కలుగుతుంది.
సైబర్ స్కామ్ లను అరికట్టేందుకు కొత్త సిస్టమ్
మరోవైపు ప్రభుత్వ అధికారుమంటూ విదేశాలనుంచి ఫోన్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులను రక్షించేందుకు కేంద్రప్రభుత్వం కొత్త సిస్టమ్ అందుబాటులోకి తెస్తుంది. అంతర్జాతీయ ఇన్ కమింగ్ స్ఫూఫ్డ్ కాల్స్ ప్రివెన్సెన్ సిస్టమ్ పరిచయం చేస్తోంది. భారతీయ నంబర్లతో (+91) కూడిన విదేశీ మోసపూరిత కాల్స్ నుంచి కస్టమర్లను రక్షించేందుకు ఈ కొత్త సిస్టమ్ ను రూపొందించారు.
భారత్ లో పెరుగుతున్న డిజిటల్ ముప్పు
దేశంలో రోజురోజుకు సైబర్ క్రైం లు బాగా పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ స్పూఫ్డ్ కాల్స్ తో పెద్ద ఎత్తున సైబర్ స్కామ్ లు జరుగుతున్నాయి. సైబర్ ఫ్రాడ్ స్టర్లు అధికారులమంటూ వీడియో కాల్స్ చేస్తారు. తప్పుడు నేరాలను క్లెయిమ్ చేస్తే బాధితులను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇటువంటి స్కామ్ లను నియంత్రించేందుకు ట్రాయ్ భద్రతా కార్యక్రమాలను చేపడుతోంది.
OTP నియంత్రణతో కస్టమర్లపై ఎటువంటి ప్రభావం..
ట్రాయ్ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే.. కస్టమర్లు ఓటీపీ, లావాదేవీల మేసేజ్ లకు తాత్కలికంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ట్రాయ్ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వం చర్యలు డిజిటల్ కమ్యూనికేషన్ ను సేఫ్ ఉంచేందుకు ముఖ్యమైన దశలు.. ఇవి కస్టమర్లు ఓటీపీ, లావాదేవీల మేసేజ్ లకు తాత్కలికంగా ప్రభావం చేయొచ్చని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు.