
సినిమా రివ్యూలపై ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా ఏదైనా సినిమాలు రిలీజ్ అయిన వారం రోజుల వరకూ రివ్యూలు రాయకుండా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య కొందరు సినిమా రివ్యూల పేరుతో చేస్తున్న పనులపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీరియస్ అవుతోంది. అంతేకాదు సినిమాలు రిలీజ్ అయ్యి ఫస్ట్ షో కూడా పడకముందే కొందరు రివ్యూలు రాస్తున్నారు.
దీంతో సినిమా లవర్స్ కూడా థియేటర్ కి వెళ్లి మూవీ చూసేందుకు ఇష్టపడటం లేదు. ఇంకొందరైతే ఏమాత్రం సినిమా నాలెడ్జ్ లేకపోయినా ఎదో ఒక మైక్ పట్టుకుని థియేటర్ ముందుకెళ్లి హడావిడి చేస్తూ నెగిటివిటి స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో ప్రొడ్యూసర్స్ నష్ట పోతున్నారు. చిన్నాచితకా హీరోల సినిమాలైతే కనీసం పట్టుమని పది రోజులు కూడా ఆడటం లేదు. ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | అదిదా జపాన్: ఓ వైపు తారక్ స్టైలిష్ ఫోటోషూట్.. మరోవైపు దుమ్ము రేపుతున్న దేవర వసూళ్లు
ఈక్రమంలోనే ఛాంబర్ కు ప్రొడ్యూసర్ కౌన్సిల్ పూర్తి రైట్స్ ఇచ్చింది. దీంతో సినిమా రిలీజ్ అయిన వారంలోపు రివ్యూ రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇటీవలే కేరళ సినీ పరిశ్రమకి చెందిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కేరళ కోర్ట్ ని ఆశ్రయించగా నిర్మాతలకి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఇదే తీర్పుని టాలీవుడ్ లో కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.