ధోనికి చోటులేదు.. యువీ ఆల్ టైమ్ XIలో నలుగురు ఆస్ట్రేలియన్లు

మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం(జులై 13) బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో మెన్ ఇన్ బ్లూ.. పాకిస్థాన్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఈ విజయం అనంతరం భారత వెటరన్ ఆల్ రౌండర్ యువీ తన తన ఆల్ టైమ్ XIని ప్రకటించాడు. ఈ టీమ్‌లో దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిపెట్టిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చోటు దక్కకపోవడం గమనార్హం.

ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించిన యువరాజ్ సింగ్.. తనను 12వ ఆటగాడిగా పరిచయం చేసుకున్నాడు. ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లకు చోటిచ్చిన యువీ.. రోహిత్ శర్మకు మూడు, విరాట్ కోహ్లీకి నాలుగు స్థానాలు కేటాయించాడు. ఇక మ్యాచ్ ఫినిషర్‌గా ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్‌ను ఎంచుకున్నాడు. ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశాడు.

ఆండ్రూ ఫ్లింటాఫ్‌

ఇక ఆల్ రౌండర్‌గా ఇంగ్లండ్ మాజీ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను ఎంపిక చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. స్పిన్నర్లుగా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌, ముత్తయ్య మురళీధరన్‌ను ఎంపిక చేశాడు. పేసర్లుగా గ్లెన్ మెక్‌గ్రాత్, వసిమ్ అక్రమ్‌లను తన జట్టులోకి తీసుకున్నాడు. చివరగా 12వ ఆటగాడిగా తన పేరు చెప్పుకున్నాడు.

యువరాజ్ సింగ్ ఆల్-టైమ్ XI: సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ ఫ్లింటాఫ్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్. 

12వ ఆటగాడు: యువరాజ్ సింగ్