మొహర్రం, గణేశ్ చతుర్థి ఇళ్లలోనే జరుపుకోండి: సీపీ అంజనీ కుమార్

మొహర్రం, గణేశ్ చతుర్థి ఇళ్లలోనే జరుపుకోండి: సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్: కరోనా కోరలు చాచి విజృంభిస్తోంది. ప్రతి రోజూ దేశంలో వేలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నెలలోనే వినాయక చతుర్థి, మొహర్రం పండుగలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నాయి. తాజాగా ఈ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా మొహర్రం, గణేశ్ చతుర్థిని ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని.. ఎలాంటి ఊరేగింపులు, విగ్రహ సంస్థాపనలు చేయొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు.

‘మేం మీ ఆరోగ్యం, సంరక్షణ గురించి శ్రద్ధ వహిస్తాం. కరోనా నుంచి మీ కుటుంబాలను కాపాడుకోండి. మొహర్రం మాతమ్‌ను మీ ఇళ్లలోనే జరుపుకోండి. అలాగే, అందరూ గణేశ్ పూజలనూ ఇళ్లలోనే జరుపుకోవాలి. ప్రభుత్వ సూచనల ప్రకారం విగ్రహ సంస్థాపనలు, పబ్లిక్ ప్లేసెస్‌లో ఎలాంటి ఈవెంట్‌ల నిర్వహణకు గానీ అనుమతి లేదు. మీతోపాటు నగరాన్ని సురక్షితంగా ఉంచండి’ అని అంజనీ కుమార్ పేర్కొన్నారు.