
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు అక్కర్లేదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) సభ్యుడు జయప్రకాశ్ ములియిల్ అన్నారు. దేశంలో ఇప్పటికే సగానికి పైగా జనాభాకు ఫస్ట్ డోస్ ఇచ్చినందున.. భయం అక్కర్లేదని చెప్పారు. వ్యాక్సిన్‌లు శరీరాన్ని యాంటిజెన్‌లను గుర్తించేలా ప్రోగ్రాం చేస్తాయని.. దీంతో ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు రోగనిరోధక వ్యవస్థ అలర్టయి దానితో పోరాడుతుందన్నారు. గతంలో వైరస్ సోకని వారికి సింగిల్ డోస్ సరిపోతుందని.. రెండు డోసులు వేసుకుంటే ఇంకా సేఫ్ అని.. కానీ, ఇప్పటికిప్పుడు బూస్టర్ డోస్ అక్కర్లేదని అభిప్రాయపడ్డారు. ఇమ్యూనిటీ అనేది నేచురల్‌గా రావాలన్నారు. యూరప్ జనాభాలో చాలావరకు టీకాలతో పెరిగిన ఇమ్యూనిటీనే ఎక్కువని.. భారత్‌లో మాత్రం సహజంగా ఇంప్రూవ్ చేసుకున్నారని చెప్పారు.