గొడవలు వద్దు.. కలిసి పని చేద్దాం.. ఇండియాకు చైనా మినిస్టర్ వాంగ్ యి ప్రపోజల్

గొడవలు వద్దు.. కలిసి పని చేద్దాం.. ఇండియాకు చైనా మినిస్టర్ వాంగ్ యి ప్రపోజల్

బీజింగ్: ఇండియాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. గొడవలు పక్కనపెట్టేసి పరస్పర సహకారంతో ముందుకు వెళ్దామని కోరింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకుందామని ప్రపోజల్ పెట్టింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కంటే.. కలిసి పని చేస్తేనే ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. 

డ్రాగన్, ఎలిఫెంట్ కలిసి డ్యాన్స్ చేస్తే.. చూసేందుకు బాగుంటుందని తెలిపాడు. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మీడియాతో మాట్లాడారు. ఆసియాలోనే కీలకమైన ఇండియా, చైనా దేశాల మధ్య సహకారం ఎంతో ముఖ్యమన్నారు. అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించొచ్చని తెలిపారు. రెండు దేశాలు కలిసి పని చేసే టైమొచ్చిందన్నారు. ‘‘సహకారంతో పోయేదేమీ ఉండదు. 

ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది. మన రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడితే.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ఎంతో ప్రయోజనకరం’’ అని వాంగ్ యి అన్నారు.