నీట్ రీఎగ్జామ్ అక్కర్లేదు: సుప్రీంకోర్టు

నీట్ రీఎగ్జామ్ అక్కర్లేదు: సుప్రీంకోర్టు
  • భారీ స్థాయిలో లీకైనట్టు ఆధారాలు లేవు: సుప్రీంకోర్టు
  • మళ్లీ పరీక్ష అంటే 24 లక్షల మంది స్టూడెంట్లపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడి

న్యూఢిల్లీ: నీట్ యూజీ రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రశ్నపత్రం భారీ స్థాయిలో.. వ్యవస్థీకృతంగా లీక్ అయినట్టు ఆధారాల్లేవని పేర్కొంది. ప్రశ్నపత్రం లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకల నేపథ్యంలో నీట్ యూజీ మళ్లీ నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ మే5న సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 

వీటిని విచారించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఎన్టీఏ సమర్పించిన డేటా, ఐఐటీ మద్రాస్ రిపోర్టు ప్రకారం పేపర్ లీక్ పెద్ద ఎత్తున జరగలేదని స్పష్టమతున్నట్టు పేర్కొంది.  ఈ దశలో ఇప్పటి వరకు జరిగిన వాటిని నీరుగార్చలేమని సీజే చంద్రచూడ్ అన్నారు.