ఏపీలో ఎక్కడా రీ పోలింగ్‌ అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా

చిన్న చిన్న ఘటనలు మినహా ఏపీలో  ఓటింగ్ శాతం ప్రశాంతంగా ముగిసిందని సీఈవో ముకేశ్‌ కుమార్ మీనా స్పష్టం చేశారు.  పల్నాడు, తెనాలి, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై  చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు  సీఈవో ముకేశ్‌ కుమార్ మీనా.  పోస్టల్ బ్యాలెట్‌లోనూ 90 శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు.  

ఎక్కువ మంది ఓటర్లు వచ్చిన కారణంగానే పోలింగ్ ఆలస్యమైందని వెల్లడించారు.  ముందుగానే ఊహించి పోలింగ్‌ కేంద్రాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. 300 మందికిపైగా క్యూలో ఉన్నచోట్ల రాత్రి 10 వరకు పోలింగ్‌ జరగొచ్చని అంచనా వేశారు.   సాయంత్రం 5గంటల వరకు రాష్ట్రంలో 68 శాతం పోలింగ్‌ జరిగిందని తుది పోలింగ్‌ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తామ మీనా తెలిపారు.