
దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ లో కాల్చి చంపడం సరైన శిక్షేనని అన్నారు వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితులు చేసిన దారుణానికి వారికి సరైన శిక్షే పడిందని అన్నారు. దేవుడు చాలా దయగలవాడు కాబట్టే ఒక్క బుల్లెట్ తో వారి ప్రాణాలు పోయేలా శిక్షించారన్నారు. కామంతో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే మృగాళ్లకు ఇదొక గుణపాఠమని అన్నారు. ఈ కేసులో నిందితులను శిక్షించాలని దేశమంతా కోరుకుందని, అందువల్లే ఎన్ కౌంటర్ జరిపిన పోలీసు అధికారులపై అభినందనల జల్లు కురుస్తోందని అన్నారు. దారుణంగా రేప్ చేసి, హత్య చేసిన నిందితుల మరణంపై కొందరు జాలి పడుతున్నారని.., ఈ ఎన్‌కౌంటర్ ను ఖండిస్తున్నారని ఆయన అన్నారు. వాళ్లంతా దేశద్రోహులని ఆయన అభివర్ణించారు.
దిశ కు సరైన న్యాయం జరిగిందంటూ మహిళలు, ప్రజలు ఈ ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు రాజకీయ నాయకులు, ప్రముఖులు పోలీసులు జరిపిన కాల్పుల్ని తప్పుపడుతున్నారు. ఎన్ కౌంటర్ మాత్రం సరైన పరిష్కారం కాదని అంటున్నారు.