మేం కోర్టుకే చూపిస్తాం.. దారిన పోయే వాళ్లకు కాదు.. ప్రధాని మోదీ డిగ్రీపై ఢిల్లీ యూనివర్సిటీ

మేం కోర్టుకే చూపిస్తాం.. దారిన పోయే వాళ్లకు కాదు.. ప్రధాని మోదీ డిగ్రీపై ఢిల్లీ యూనివర్సిటీ

ప్రధాని మోదీ డిగ్రీ పట్టా కోర్టుకు చూపిస్తామని, దారిన పోయే అనామకులకు చూపించాల్సిన అవసరం లేదని ఢిల్లీ యూనివర్సిటీ కోర్టుకు తెలిపింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) కింద మోడీ పట్టా చూపించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి పడితే వారికి చూపించలేమని ఢిల్లీ కోర్టుకు స్పష్టం చేసింది. 

మోదీ గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన వివరాలను రైట్ టు ఇన్ఫర్మేష్ యాక్ట్ కింద చూపించాల్సిందేనని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC) ఇచ్చిన ఆర్డర్ కు వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీ వేసిన పిటీషన్ గురువారం (ఫిబ్రవరి 27) విచారణకు వచ్చింది. యూనివర్సిటీ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ పిటీషన్ ను విచారించిన జస్టిస్ సచిన్ దత్తా తీర్పును రిజర్వ్ చేశారు. 

‘‘రికార్డులను కోర్టు ముందు ఉంచేందుకు యూనివర్సిటీకి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అనామకులు స్క్రుటినీ చేస్తామంటే ఎలా చూపించేది’’ అని తుషార్ మెహతా అన్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద యూనివర్సిటీ రికార్డులను ఒక్కసారి చూపిస్తే.. చాలా మంది అడిగే ప్రమాదముందని, ఇది యూనివర్సటీకి ఇబ్బంది కలిగే అంశమని ఆయన వాదించారు. 

ALSO READ : 100 కోట్ల మంది దగ్గర ఖర్చులకు పైసల్లేవ్.. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పైసల్ తీస్తుండ్రు

ఇది రాజకీయ ప్రేరేపిత పిటీషన్ అని, వేరే ఉద్దేశంతో 1978లో చేసిన డిగ్రీ పట్టాను బహిర్గతం చేయాలని అడుగుతున్నారని, పిటీషనర్ ఉద్దేశం ఏంటో కోర్టుకు తెలుసని నమ్ముతున్నామని ఆయన కోర్టు ముందు వాదించారు. 

ALSO READ : SEBI చీఫ్గా తుహిన్ పాండే..

ఢిల్లీ యూనివర్సిటీలో 1978లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల RTI యాక్ట్ కింద ఇవ్వాలని 2016, డిసెంబర్ 21న నీరజ్  అనే వ్యక్తి CIC లో ప్లీ వేశారు. 1978లో BA పరీక్షలు రాసిన విద్యార్థుల జాబితా ఇవ్వాలని ఆయన ప్లీ వేశారు. 2017, జనవరి 23 న స్టే ఇచ్చింది. ఇయితే నిన్నటి విచారణలో వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.