అంతకుముందు నలుగురే ఓటమిపాలు
న్యూయార్క్: ప్రస్తుత ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో గెలవకపోతే 1992 తరువాత తొలిసారిగా రీఎలక్షన్‌లో ఓడిపోయిన ప్రెసిడెంట్‌గా రికార్డుల్లోకి ఎక్కుతారు. 1992 తరువాత అందరు ప్రెసిడెంట్లు రీఎలక్షన్‌లో గెలిచారు. 1992 ఎన్నికల్లో జార్జ్ సీనియర్ బుష్ రెండోసారి ఓటమిపాలు కాగా, డెమొక్రాట్ క్యాండిడేట్ బిల్ క్లింటన్గెలిచారు. బుష్ తరువాత పదవిలోకి వచ్చిన క్లింటన్, జార్జ్ జూనియర్ బుష్, బరాక్ ఒబామా రీఎలక్షన్లలో విజయాన్ని అందుకున్నారు. అమెరికాలో గత వందేళ్లలో నలుగురు ప్రెసిడెంట్లు మాత్రమే రెండోసారి ఓడిపోయారు.
జార్జ్ సీనియర్ బుష్
1992లో జార్జ్ సీనియర్ బుష్ ఓటమితో రిపబ్లికన్ల సుదీర్ఘ పాలనకు తెరపడింది. 1968 నుంచి 1992 వరకు చాలాసార్లు రిపబ్లికన్లే గెలుస్తూ వచ్చారు. సీనియర్ బుష్‌కు అప్రూవల్స్ రేటింగ్ 89 శాతం రావడంతో, అంతా ఆయనే గెలుస్తారని అనుకున్నారు. చివరికి క్లింటన్ 370 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో ప్రెసిడెంట్ అయ్యారు. బుష్‌కు 168 ఓట్లు మాత్రమే వచ్చాయి.
జిమ్మీ కార్టర్
డెమొక్రాట్ జిమ్మీ కార్టర్ 1980లో రెండోసారి పోటీ చేసినా, రిపబ్లికన్ రోనల్డ్ రీగన్ గెలిచారు. రీగన్ ఏకంగా 50.7 శాతం పాపులర్ ఓట్లు సాధించారు. అప్పటి వరకు అత్యధిక వయసున్న (69 ఏళ్లు) ప్రెసిడెంట్‌గానూ రికార్డులకు ఎక్కారు. డోనాల్డ్ ట్రంప్ ఈ రికార్డును తుడిచేశారు. 70 ఏళ్ల వయసులో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
జెరాల్డ్ ఫోర్డ్
రిపబ్లికన్ క్యాండిడేట్ జెరాల్డ్ ఫోర్డ్ కూడా1976లో రీఎలక్షన్‌లో సక్సెస్ కాలేకపోయారు. అప్పుడు జిమ్మీ కార్టర్ గెలిచారు. వాటర్ గేట్స్కామ్ కారణంగా రిచర్డ్ నిక్సన్ 1974లో రిజైన్ చేయడంతో, వైస్ ప్రెసిడెంట్ జెరాల్డ్ ఫోర్డ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికకాకుండానే ప్రెసిడెంట్ అయిన తొలి నేత ఫోర్డే!
హెర్బర్ట్ హూవర్
రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ హెర్బర్ట్ హూవర్1932లో రెండోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయగా.. ఆయనను డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ ఫ్రాంక్లిన్రూజ్వెల్ట్ ఓడించారు. అప్పుడు అమెరికాలో తీవ్రమైన మాంద్యం రావడంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో హూవర్ పై విసుగెత్తిన ప్రజలు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ను భారీ మెజారిటీతో గెలిపించారు.
For More News..