అబద్దాలు చెప్పడంలో  కేసీఆర్ను మించినోడు లేడు: రేవంత్ రెడ్డి

అబద్దాలు చెప్పడంలో  కేసీఆర్ను మించినోడు లేడు: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లేవన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఒకటైతే నిజం.. పచ్చి అబద్ధాలను కూడా ఇదే నిజం అనిపించేలా చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్! తెలంగాణలో ఉరికొయ్యలకు వేలాడుతున్న రైతుల లెక్కలు ఎన్సీఆర్ బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని, లెక్కకు రానివి ఇంతకు పదింతలు ఉన్నాయని రేవంతో ఆరోపించారు. “రైతు స్వరాజ్య వేదిక” సమక్షంలో ఇద్దరం కూర్చుందాం.. ఆత్మహత్యలు లేవన్న నీ మాటల్లో నిజమెంతో నిగ్గుతేల్చుదాం. కేసీఆర్…సిద్ధమా?! అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

నిన్న ప్రగతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్రంలో రైతు హత్యలు లేవని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తోందని, దానివల్లే రైతుల ఆత్మహత్యలు తక్కువయ్యాని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన రేవంత్.. సీఎం జిల్లా సిద్దిపేటలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని, వాటిని దాచి అబద్దాలు మాట్లాడటం సరికాదని రేవంత్ రెడ్డి ఫైర్అయ్యారు.