విహార యాత్రలు వెళుతుంటే... ఎక్కడైనా నది కనపడితే చాలు.. వెంటనే వాహనం ఆపి స్నానం చేస్తాం.. మరికొందరు దీపాలు వదులుతారు.. ఇంకొందరు తర్పణాలు వదులుతారు, ఇలా భారతదేశంలో చాలా పుణ్య నదులు ఉన్నాయి. కాని బీహార్.. ఉత్తర ప్రదేశ్ లలో ప్రవహించే ఓ నది నీటిని తాకితే పుణ్యం రాదట.. ఇంకా పాపాలు కూడా రెట్టింపవుతాయట.. ఇంతకూ ఆ నది పేరేంటి.. అదెక్కడ ఉంది..
ఏ ప్రాణి జీవించాలన్నా నదులే ఆధారం. అందుకనే అవి పూజించే విధంగా.. కృష్ణ, గోదావరి, గంగా ఇలా ఏ నదైనాపుణ్యక్షేత్రాల పక్కనే ఉంటాయి. నదుల్లో పుణ్యస్నానం ఆచరించి స్వామి వారి స్నానం ఆచరిస్తారు. నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉందని పురాణాలు చెబుతాయి. కాని మన దేశంలో ఓ నదిని తలవరు.. అందులోని నీటిని తాగరు.. కనీసం కాళ్లు కూడా కడగరు... అంటుకోరు. పురాణాలు తెలిపిన ప్రకారం ఈ నది శాపగ్రస్త నది అంటారు. దీనినే కర్మనాశన నది అని కూడా అంటారు.
పురాణాల ప్రకారం హరిశ్చంద్ర రాజు తండ్రి సత్యవ్రతుడు.. ఇతడు చాలా ధైర్యవంతుడు. సత్యవ్రతుని గురువు వశిష్ఠుడు.. వేద విద్యలు అభ్యసించిన తరువాత.. సత్యవ్రతుడు అతని గురవైన వశిష్ఠుడిని ఓ వరం కోరాడు. ప్రాణం ఉండగానే స్వర్గలోకానికి వెళ్లాలని ఉందని ఆ కోరికను ఎలాగైనా తీర్చమని ప్రాదేయపడతాడు. అయితే ఆ కోరికను తీర్చడానికివశిష్ఠుడు నిరాకరించాడు. అప్పుడు వశిష్ఠుడి పై కోపంతో సత్యవ్రతుడు విశ్వామిత్రుడి వద్దకు వస్తాడు.
విశ్వామిత్రుడికి.. వశిష్ఠుడు అంటే అసూయ, అకారణ శత్రుత్వం కారణంగా.. వశిష్టుడు కాదన్న రాజు సత్యవ్రత్రుడి కోరికను తీర్చడానికి విశ్వామిత్రుడు అంగీకరించాడు విశ్వామిత్రునికి తపశ్శక్తి చాలా ఎక్కువుగా ఉంటుంది. అందువలన సత్యవ్రతునికి కోరికను తీరుస్తానని.. తరువాత వచ్చే పాప పుణ్యాలకు తనకు సంబంధం లేదని ఒప్పందం చేసుకుంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన తపశ్శక్తి ని ఉపయోగించి సత్యవ్రత్రుడిని స్వర్గానికి పంపాడు.
స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు సత్యవ్రతుడి రాకను గమనించి...నియమాలకు విరుద్దంగా స్వర్గలోకానికి ప్రవేశించడంతో ... ఆగ్రహించిన ఇంద్రుడు సత్యవ్రతుడిని భూమిపైకి తోసేశాడు. అప్పుడు తలక్రిందులుగా వస్తున్న సత్యవ్రతుడిని చూసి విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో స్వర్గానికి .. భూమికి మధ్యలో ఉండేలా చేస్తాడు. ..ఆకాశంలో తలక్రిందులుగా వేలాడుతున్న సమయంలో అతని నోటి నుండి లాలాజలం వేగంగా కారడం ప్రారంభించింది. ఈ లాలాజలం నది రూపంలో భూమిపై ప్రవహించడం మొదలైంది. వశిష్ఠ మహర్షి రాజును శపించాడని ..అతని లాలాజలం నుంచి ఏర్పడిన నది కనుక కర్మనాశ నది అని .. శాపగ్రస్త నది అని పిలుస్తారు.
ఈ నది నీటిని తాకడం వల్ల పనులు చెడిపోతాయని, మంచి పనులు కూడా మట్టిలో కలిసిపోతాయని నమ్ముతారు. అందుకే ఈ నది నీటిని ప్రజలు ముట్టుకోరు. అలాగే ఏ పని కోసం ఉపయోగించరు.
బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో ఈ నది ప్రవహిస్తుంది. ఈ నది పేరు కర్మనాశననది. కర్మ అంటే పని .. నాశ అంటే నాశనం అని అర్థం వచ్చే విధంగా ఈ నదిని రెండు పదాల కలయికతో రూపొందించారని పండితులు చెబుతున్నారు. ఈ నదికి సంబంధించి ఆశక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ నదికి మునులు శాపం ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కర్మనాశ నది బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఉద్భవించి.. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లో ప్రవహిస్తుంది.. ఈ నది బీహార్, యుపిలను కూడా విభజిస్తుంది. కర్మనాశ నది ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర, చందౌలీ, వారణాసి, ఘాజీపూర్ గుండా ప్రవహిస్తుంది.