తొలి రెండు రౌండ్లలో అజేయంగా నిలిచిన టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో అసలైన పరీక్షకు సిద్ధమైంది. పుష్కర కాలంగా ఊరిస్తున్న వరల్డ్ కప్‌ను అందుకునేందుకు 2 అడుగుల దూరంలో నిలిచిన ఇండియా తమను వెంటాడుతున్న నాకౌట్ భయాన్ని వీడి టీ20 కప్ ఫైనల్లో అడుగు పెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ఇందులో గెలిచి 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో తమను ఓడించిన ఇంగ్లిష్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది. ఇంకోవైపు తమ మార్కు దూకుడును కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకునేందుకు చేరువ కావాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య థ్రిల్లింగ్ ఫైట్‌ను ఆశించొచ్చు. కానీ, మ్యాచ్‌కు వాన ముప్పు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మ్యాచ్ రద్దయితే మనోళ్లే ఫైనల్‌కు
ఈ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపొచ్చు. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. గురువారం వర్షం కురిసే అవకాశం 88 శాతం ఉంది. ఈ పోరుకు రిజర్వ్ డే కూడా లేదు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే సూపర్8లో ఎక్కువ పాయింట్లతో నిలిచిన ఇండియా ఫైనల్ చేరుతుంది.