
ఆగస్టు 5న ప్రారంభం కానున్న ది హండ్రెడ్ 2025 ఎడిషన్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఈ లీగ్ డ్రాఫ్ట్ లో ఒక్క పాకిస్థాన్ ఆటగాడిని కూడా తీసుకోలేదు. గత కొంతకాలంగా పాక్ ఆటగాళ్ల నిలకడ లేమి తనమే ఇందుకు కారణమని తెలుస్తుంది. పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లకు సైతం హండ్రెడ్ లీగ్ లో నిరాశ తప్పలేదు. నసీమ్ షా, ఇమాద్ వసీంతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ సైమ్ అయూబ్ తో సహా మొత్తం 45 మంది పాకిస్తానీ ఆటగాళ్ళు డ్రాఫ్ట్ కోసం తమ పేరును నమోదు చేసుకున్నారు. అయితే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఏ ఒక్కరు కూడా వీరిని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు.
2024 సీజన్ లో ది హండ్రెడ్‌లో అత్యంత ఖరీదైన పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా (PKR 36.2 మిలియన్లకు పైగా) కు ఎంపికయ్యాడు. ఇమాద్ వసీం, సైమ్ అయూబ్‌లు (PKR 23.5 మిలియన్ల) షాదాబ్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ హస్నైన్‌లు (PKR 22.7 మిలియన్లు) ఈ లీగ్ ఆడారు. ఛాంపియన్స్ ట్రోఫీలో సొంతగడ్డపై ఒక్క విజయం లేకుండా పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.. ఇప్పుడు ప్రపంచ లీగ్ ల్లో కూడా ఆ జట్టు ఆటగాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆగస్టు 5 నుండి ఆగస్టు 31 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. లార్డ్స్, ది ఓవల్, ఎడ్జ్‌బాస్టన్ వేదికలలో మ్యాచ్‌లు జరుగుతాయి.
Also Read : బ్యాటర్‌గానే ఆడతానన్న ఆసీస్ ఆల్ రౌండర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను లండన్ స్పిరిట్ తీసుకోగా.. ఇంగ్లాండ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను ఎవరూ కొనలేదు. అండర్సన్ ఐపీఎల్ లో కూడా ఏ జట్టు వేలంలో తీసుకోలేదు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడడానికి సిద్ధమన్న ఈ ఇంగ్లాండ్ పేసర్ కు నిరాశే మిగిలింది. ఆండ్రీ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ ను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ తో పాటు ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున ఆడనున్నారు.
THE HUNDRED MEN'S DRAFT:
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2025
Pakistani players registered - 45.
Pakistani players picked - 0. pic.twitter.com/0PvIPREspG