మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ల్యాండ్ మార్క్ పాలసీని పరిశీలిస్తోంది. ఇందులోభాగంగా ఇకనుంచి కొత్త కారు కొనేవారు తప్పనిసరిగా కారు పార్కింగ్ స్థలం కూడా కలిగి ఉండాలనే నిభంధనని తప్పనిసరి చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ విషయంపై మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక నుంచి కారు కొనాలనుకున్నవారు పార్కింగ్ స్థలం తప్పనిసరిగా కలిగి ఉండాలని అన్నారు. ఈ మధ్యకాలంలో ముంబై వంటి మెట్రో పాలిటన్ సిటీలలో సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో ఉంటున్నవారు కూడా కారు కొంటున్నారని, కానీ పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపై కార్లు పార్క్ చేస్తున్నారని తెతెలిపారు.
దీంతో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్స్, ఇతర ఎమర్జెన్సీ వెహికిల్స్ వంటివి వెళ్లాలంటే ఇబ్బంది కలుగుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకోబుతున్నట్లు అభిప్రాయం వ్యక్త చేశారు. అంతేకాకుండా నగరంలో ట్రాఫిక్ రద్దీని కూడా కంట్రోల్ చెయ్యడానికి వీలుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
తాము పేదలు కార్లు కొనకూడదని చెప్పడం లేదని, కానీ కారు కొనేముందు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాని వెల్లడించారు. పిల్లలు కనే ముందు కుటుంబాలు ఖర్చులను ప్లాన్ చేసుకున్నట్లే, ప్రజలు తమ కారు అవసరాలకు పార్కింగ్తో సహా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఈ పబ్లిక్ పార్కింగ్ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరియు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తదితరులతో కలసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.