జీహెచ్ఎంసీ, పోలీసుల ద్వారానే డిస్ట్రిబ్యూషన్
పాత పాసులు చెల్లవు, కొత్తవి ఇయ్యరు
పేదలు, వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు దాతలు రోడ్లమీదికి వస్తుండడంతో లాక్డౌన్ లక్ష్యం దెబ్బతింటోంది. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడడం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదమూ ఉంది. దాంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డోనర్స్ కచ్చితంగా జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారుల ద్వారానే తమ సాయం అందించాలని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం నుంచి స్వచ్ఛంద సంస్థలు, దాతలకు కొత్త పాసులు జారీ చేయబోమని, పాతవి చెల్లవని పేర్కొన్నారు. డోనర్స్ ముందుగా జీహెచ్‌ఎంసీ, పోలీసులకు సమాచారమిస్తే.. వారి నుంచి సేకరించి నిరుపేదలు, యాచకులు, వలస కార్మికులకు అందజేస్తామన్నారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకూ ఇదే వర్తిస్తుందని ఆయన అన్నారు.
For More News..