యాదాద్రిపైకి ప్రైవేటు వాహనాలకు నో పర్మిషన్

దాదాపు నాలుగేండ్ల తర్వాత యాదాద్రి నరసింహుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. యాదాద్రిని మరో తిరుపతిగా మార్చాలనే లక్ష్యంతో.. అంగరంగవైభవంగా ఆధునీకరించారు. తాజాగా మహా సంప్రోక్షణ యాగం తర్వాత భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొండపైకి భక్తులను తరలించడానికి గుడికి సంబంధించిన ఉచిత బస్సులను ఏర్పాటుచేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. బయటి వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. టూవీలర్లపై కొండపైకి వెళ్తున్న స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను కొండపైకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఘాట్ రోడ్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన ఆలయ ఈవో గీతారెడ్డి.. టూవీలర్ సహా భక్తుల వాహనాలకు కొండపైకి నిషేధమని ఉత్తర్వులు జారీ చేశారు.

For More News..

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు