
పాత వాహనాలకు ఇకపై పెట్రోల్, డీజిల్ కొట్టరు... షాక్ అయ్యారా, అవును నిజమే.. 15ఏళ్ళు పైబడిన పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టద్దంటూ సంచలన నిర్ణయం తీసుకుంది ఢిల్లీ సర్కార్. ఈమేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిదర్ సిర్సా కీలక ప్రకటన చేశారు. మార్చి 31వ తేదీ తర్వాత 15ఏళ్ళు పైబడిన పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ పెట్రోల్ కొట్టద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు.. హైరైజ్ బిల్డింగులు, స్టార్ హోటళ్లు, ఆఫీస్ కాంప్లెక్సులలో యాంటీ స్మాగ్ గన్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి మంజిదర్ సిర్సా.
పెట్రోల్ బంకులలో 15ఏళ్ళ పైబడిన పాత వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి. అంతే కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు షిఫ్ట్ చేయనున్నట్లు తెలిపారు మంత్రి సిర్సా.
డిసెంబర్ 2025 నాటికి 90శాతం సీఎన్జీ బస్సుల నిలిపివేత:
డిసెంబర్ 2025 నాటికి ఢిల్లీలో దాదాపు 90 శాతం ప్రభుత్వ CNG బస్సులను దశలవారీగా నిలిపివేసి, పరిశుభ్రమైన, స్థిరమైన ప్రజా రవాణా దిశగా అడుగులేస్తున్నామని తెలిపారు మంత్రి. నిలిపివేసిన బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేస్తామని తెలిపారు.ఢిల్లీ వాసులకు పెద్ద సమస్యగా మారిన వాయు కాలుష్యాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి సిర్సా.
క్లౌడ్ సీడింగ్ కోసం అవసరమైన ఏ అనుమతినైనా తీసుకుంటామని.. ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉన్న క్రమంలో క్లౌడ్ సీడింగ్ ద్వారానే వర్షాలు కురుస్తాయని.. తద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు మంత్రి సిర్సా.