రాహుల్ ఈ ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. దేశమంతా తిరిగారు. కానీ, ఆయన స్పీచ్‌లకు ఒక టార్గెట్, ఒక గోల్ అనేది లేకుండా పోయింది. రాఫెల్ స్కాంని పదే పదే ప్రస్తావించినా చివరివరకు నిలబడలేకపోయారు. ‘చౌకీదార్ ఛోర్ హై’ విమర్శపై సుప్రీంకోర్టు సీరియస్ అవటంతో ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది. మొదట్లోనే తేల్చేసే ఛాన్స్ ఉన్నా వాడుకోలేదు. ‘బీజేపీకి బదులు కాంగ్రెస్‌ని ఎందుకు ఎన్నుకోకూడదు’ అని ఓటర్లు అనుకునేలా కన్విన్స్ చేయలేకపోయారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసి, గ్రాస్‌రూట్ లెవెల్ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపగలిగితే చాలు. కానీ, ఆ పని రాహుల్ వల్ల సాధ్యమా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
తాజా లోక్‌సభ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్‌తో ఇప్పడు ఆ పార్టీలోని అన్ని వేళ్లూ రాహుల్‌గాంధీ వైపే చూపుతున్నాయి. జనరల్ ఎలక్షన్ ఫైట్ ప్రారంభమైన మొదటి రోజు నుం చీ ఆయన అన్‌ఫిట్‌గా, అయిష్టం గానే కనిపించారు. ఫలితంగా దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే, అందులో 12 చోట్ల కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా రాకపోవటంతో పాటు మరో 11 చోట్ల ఒక్కొక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అలా అని రాహుల్‌గాంధీ ఈ ఎన్నికల సమరాన్ని లైట్ తీసుకున్నారా అంటే కాదనే చెప్పాలి. ఆయన దేశం మొత్తం తిరిగి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. చాలా కష్టపడ్డారు. పోరాడారు. కానీ అది ఫలించలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రచారంలో ఏ అంశాలపై ఎక్కువగా మాట్లాడాలనే క్లారిటీ లోపించింది. ఆయన స్పీచ్‌లకు ఒక టార్గెట్, ఒక గోల్ అనేది లేకుండా పోయింది. రాఫెల్ స్కాం గురించే పదే పదే ప్రస్తావించారు. కానీ ఆ ఆరోపణలకు పక్కాగా రుజువులు చూపలేకపోయారు. మొత్తానికి సరైన వ్యూహం లేకనే ఇలాంటి పరాజయం చవిచూడాల్సి వచ్చిందని పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్‌తో ఇప్పడు ఆ పార్టీలోని అన్ని వేళ్లూ రాహుల్‌గాంధీ వైపే చూపుతున్నాయి. జనరల్ ఎలక్షన్ ఫైట్ ప్రారంభమైన మొదటి రోజు నుంచీ ఆయన అన్‌ఫిట్‌గా, అయిష్టంగానే కనిపించారు. ఫలితంగా దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే, అందులో 12 చోట్ల కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా రాకపోవటంతోపాటు మరో 11 చోట్ల ఒక్కొక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఎన్నికల వేళ అనుకోని వివాదం
‘చౌకీదార్ ఛోర్ హై’ విమర్శ మినహా మరో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. దీంతో మోడీని విమర్శించటం తప్ప రాహుల్‌కు మరో పని లేదనే చెడ్డ పేరు వచ్చింది. అంతేకాదు. కాపలాదరునని చెప్పుకునే వ్యక్తే అసలు దొంగ అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటూ తనకుతానే తేల్చేశారు. తద్వారా అత్యున్నత న్యాయస్థానం ఆ మాట అనకపోయినా అన్నట్లు జనం భావించటానికి కారణమయ్యారు. ఇదొక వివాదంగా మారింది. సుప్రీంకోర్టు సీరియస్ అవటంతో చివరికి రాహుల్‌గాంధీయే సారీ చెప్పాల్సి వచ్చింది. ఎన్నికల వేళ ఊహించని ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. ఈ విషయాన్ని ఇంత దూరం లాక్కుండా మొదట్లోనే తేల్చేసే ఛాన్స్ ఉన్నా వాడుకోలేదు.
సిద్ధాంతాలను సొంతం చేసుకోలేక..
ఐడియాలజీ విషయానికి వస్తే రాహుల్‌గాంధీ హిందూయిజాన్ని సొంతం చేసుకోలేకపోయారు. మతం అనే ఒక పెద్ద ఇష్యూని రాజకీయ కోణంలో మనస్ఫూర్తిగా డీల్ చేయలేకపోయారు. గుళ్లూగోపురాలు బాగానే తిరిగి యజ్ఞాలూ యాగాలు చేశారు కానీ ‘అయోధ్యలో రాముడి గుడి’ గురించి ఒక్క ముక్కైనా మాట్లాడలేదు. తన కుటుంబ పెద్దలు; లెజెండ్ లీడర్లు అయిన జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వ్యక్తిగత, రాజకీయ జీవితాలను ఒకసారి తిరగేస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఇండిపెండెన్స్‌కి ముందు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా రైట్ వింగ్ ఐడియాలజీనే ఫాలో అయినట్లు గమనించొచ్చు. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చీఫ్‌గా రాహుల్‌గాంధీ ఈ దిశగా కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1948లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆచార్య కృపలానీ ఇండియా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డ ముస్లిం దేశం పాకిస్థాన్‌లో పర్యటించి అక్కడి హిందువుల స్థితిగతులను చూసొచ్చారు. వాళ్ల ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ ఎంతగా పట్టించుకుందో ఈ సంఘటన తెలియజేస్తోంది.
‘మోడీ నాయకత్వంలోని బీజేపీకి బదులు కాంగ్రెస్ పార్టీని తామెందుకు ఎన్నుకోకూడదు’ అని ఓటర్లు అనుకునేలా ఏఐసీసీ సుప్రీం రాహుల్‌గాంధీ కన్విన్స్ చేయలేకపోయారు. దేశంలో మెజారిటీ కమ్యూనిటీ అయిన హిందువుల ఆకాంక్షలను తానూ నెరవేర్చగలననే నమ్మకాన్ని వాళ్లకు కల్పించలేకపోతున్నారు. యూపీలోని చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు బాబ్రీ గురించి, రామజన్మభూమి గురించి పెదవి విప్పరు. అదే వాళ్లకు పెద్ద లోటుగా మారింది.
ఇప్పటికైనా తొందరేం లేదు
అయితే.. ఈ లోపాన్ని సరిచేయటానికి రాహుల్‌గాంధీకి ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు. ఏఐసీసీ స్పెషల్ సెషన్‌ను ఏర్పాటు చేసి, గ్రాస్ రూట్ వర్కర్ల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. అయోధ్య వంటి సున్నిత అంశాలపై పార్టీ విధానాన్ని స్పష్టం చేసే తీర్మానాన్ని రూపొందించొచ్చు. ఇలాంటి వివాదాస్పద విషయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా వ్యవహరించాలో దారిచూపొచ్చు. తద్వారా కేడర్‌లో విశ్వాసాన్ని నింపి భవిష్యత్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయొచ్చు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక.. ఈ ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి ట్రస్టీలుగానే భావిస్తున్నారు తప్ప పార్టీని అధికారంలోకి తేవాలని గానీ, దేశాన్ని ఏలాలని గానీ కోరుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధానులు కావటం వల్లే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారనే భయమో, మరో కారణమో గానీ ఈ తరహా ఆలోచనలు కాంగ్రెస్ పార్టీని నైతికంగా కోలోకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని పార్టీ లీడర్లు కూడా విస్మరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ప్రశ్నించే సాహసం చేయరు. వాళ్లు మాత్రమే పార్టీని గెలిపించగలరని, అధికారం అందించగలరని అనుకుంటారు. నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వరకూ ఇలాగే జరిగింది. రాహుల్‌గాంధీ విషయంలోనే రివర్స్ అయింది. కాబట్టి ఇప్పటికిప్పుడు నెహ్రూ–గాంధీ ఫ్యామిలీ బయటి వ్యక్తి హైకమాండ్‌గా రావాలని డిమాండ్ చేయకపోవచ్చు. దీనికి బదులుగా ప్రియాంకకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని అడిగితే అడగొచ్చేమో.
ప్రియాంకకు బాధ్యతలు
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక.. ఈ ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి ట్రస్టీలుగానే భావిస్తున్నారు తప్ప పార్టీని అధికారంలోకి తేవాలని గానీ, దేశాన్ని ఏలాలని గానీ కోరుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధానులు కావటం వల్లే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారనే భయమో, మరో కారణమో గానీ ఈ తరహా ఆలోచనలు కాంగ్రెస్ పార్టీని నైతికంగా కోలోకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని పార్టీ లీడర్లు కూడా విస్మరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ప్రశ్నించే సాహసం చేయరు. వాళ్లు మాత్రమే పార్టీని గెలిపించగలరని, అధికారం అందించగలరని అనుకుంటారు. నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వరకూ ఇలాగే జరిగింది. రాహుల్‌గాంధీ విషయంలోనే రివర్స్ అయింది. కాబట్టి ఇప్పటికిప్పుడు నెహ్రూ–గాంధీ ఫ్యామిలీ బయటి వ్యక్తి హైకమాండ్‌గా రావాలని డిమాండ్ చేయకపోవచ్చు. దీనికి బదులుగా ప్రియాంకకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని అడిగితే అడగొచ్చేమో.