Champions Trophy 2025: పాకిస్థాన్ గడ్డపైనే ఛాంపియన్స్ ట్రోఫీ.. మార్చేది లేదు: ఐసీసీ చీఫ్

Champions Trophy 2025: పాకిస్థాన్ గడ్డపైనే ఛాంపియన్స్ ట్రోఫీ.. మార్చేది లేదు: ఐసీసీ చీఫ్

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్టాన్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో తలపడేందుకు భారత జట్టు దాయాది దేశానికి వెళ్తుందా..! లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే టీమిండియా.. పాక్‌లో పర్యటిస్తుంది.. లేదంటే లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అది దాదాపు అసంభవమే. ఒకవేళ భారత జట్టు పాక్ పర్యటనకు నో చెప్తే, టోర్నీని మరొకచోటికి తరలిస్తారని వార్తలు రాగా.. ఐసీసీ స్పందించింది.

పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని తరలించే ఆలోచన లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ ఒక ప్రకటనలో తెలిపారు. యధాతథంగా పాక్ గడ్డపైనే టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పాడు. దాంతో టోర్నీని మరొకచోటికి తరలిస్తారని వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. 

ALSO READ : IND vs BAN: పేస్‌తో భయపెట్టేలా వ్యూహాలు.. భారత్ - బంగ్లా తొలి టెస్టుకు ఎర్రటి పిచ్‌

కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే..

ఈ విషయపై ఈ ఏడాది ప్రారంభంలోబీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తామని వెల్లడించారు. భారత ప్రభుత్వ నిర్ణయమే తమ తుది నిర్ణయమని శుక్లా చెప్పారు.

హైబ్రిడ్ మోడల్ 

ఒకవేళ భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించకపోతే, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేస్తోంది. అయితే, అందుకు పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించాలి. ఈ విషయమై కొన్ని నెలలుగా బీసీసీఐ-ఐసీసీ-పీసీబీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బయట నిర్వహించడానికి పీసీబీ అంగీకారం తెలిపితే, రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

టోర్నీలో పాల్గొనే జట్లు

  • గ్రూప్ ఏ: భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. 
  • గ్రూప్ బి: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్.