ఢిల్లీలో సింగిల్​గానే.. కాంగ్రెస్తో పొత్తులేదన్న కేజ్రీవాల్

ఢిల్లీలో సింగిల్​గానే.. కాంగ్రెస్తో పొత్తులేదన్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆప్ సొంత బలంతోనే పోరాడుతుందని.. కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తుకు అవకాశం లేదని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పొత్తు తుది దశకు చేరుకుందని.. కాంగ్రెస్ 15, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు 1–2, మిగిలిన స్థానాల్లో ఆప్ పోటీ చేయనుందని వార్తలు వెలువడటంతో ఆయన ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు బుధవారం అర్వింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సొంతంగానే బరిలోకి దిగుతుంది. కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోదు” అని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల కోసం ఆప్ ఇప్పటికే 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.