Tirumala : టీటీడీ కీలక నిర్ణయం...-బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం...-బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టిటిడి రద్దు చేసింది.

  అక్టోబరు 3 (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు,  చిన్న పిల్లల తల్లిదండ్రులకు టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరింది.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్దమవుతోంది. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ పైన టీటీడీ ఈవో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కీలక సూచనలు చేసారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ALSO READ | నీటి ఆంక్షలపై వెనక్కి తగ్గిన టీటీడీ... ప్రత్యామ్నాయాలపై కసరత్తు

అక్టోబర్ 4న ద్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ఆర్జిత సేవలతో పాటుగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

ఈ ఏడాది  తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.