అలాపెండ్లి చేస్కుంటే.. ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌ అడగొద్దు: హైకోర్టు

అలాపెండ్లి చేస్కుంటే.. ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌ అడగొద్దు: హైకోర్టు
  • అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అలహాబాద్‌‌‌‌‌‌‌‌: తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెండ్లి చేసుకున్నంత మాత్రాన పోలీసు భద్రత కల్పించలేమని అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఒక్క కారణంతోనే పోలీస్‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌ కోరొద్దంది. వారి జీవితానికి, స్వేచ్ఛకు నిజంగా ఆపద ఉన్నట్లు రుజువు కానంతవరకు పోలీసుల రక్షణను హక్కుగా కోరలేరని వ్యాఖ్యానించింది. 

సొంత ఇష్టంతో పెండ్లి చేసుకున్న కపుల్స్ ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని సూచించింది. ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ జంట.. తమకు రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై తీర్పు వెలువరిస్తూ కోర్టు ఈ కామెంట్లు చేసింది. యూపీకి చెందిన శ్రేయ కేసర్వాని పేరెంట్లను ఎదిరించి పెండ్లి చేసుకున్నది. అనంతరం, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ శ్రేయ భర్త కోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశాడు. 

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సౌరభ్‌‌‌‌‌‌‌‌ శ్రీవాస్తవ.. జంటకు ముప్పు లేనందున ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేమన్నారు. వారిపై ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లయితే రక్షణ కల్పించేందుకు పోలీసులు, కోర్టులు సిద్ధంగా ఉంటాయని వెల్లడించారు.