ఓపెన్ అయినా జనం పెద్దగా రాలే!

ఓపెన్ అయినా జనం పెద్దగా రాలే!

ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు తెరుచుకున్నయ్

ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఉంటేనే అనుమతి

అయోధ్య ఓపెన్.. చార్‌ధామ్ క్లోజ్‌లోనే..

న్యూఢిల్లీ: దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు సోమవారం తెరుచుకున్నాయి. దేవాలయాలకు భక్తులు పెద్దగా రాలేదు. అన్ని చోట్ల ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఫ్లోర్లపై గుర్తులు వేశారు. థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాత అనుమతి ఇచ్చారు. చాలా చోట్ల చర్చిలు, మసీదులు తెరవలేదు. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు ప్రార్థనాస్థలాలు, మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్ చేయలేదు. కేసులు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఎక్కడెక్కడ ఎట్లెట్ల?

ఉత్తరప్రదేశ్​లోని అయోధ్య రామ జన్మభూమి టెంపుల్ ఓపెన్ అయింది. తొలిరోజు చాలా తక్కువ మంది భక్తులు వచ్చారు. మధురలో టెంపుల్స్ మాత్రం క్లోజ్​లోనే ఉన్నాయి.

ఢిల్లీలోని టెంపుల్స్, గురుద్వారాలు తెరుచుకున్నాయి. బంగ్లా సాహిబ్ గురుద్వారాకు ఉదయాన్నే భక్తుల తాకిడి తగిలింది. అయితే చర్చిలను మాత్రం తెరవలేదు. జామా మసీద్​లో మాట్స్ తీసేశారు. ఆరడుగుల దూరం పాటించేలా మార్కింగ్స్ చేశారు. నమాజ్​కు వచ్చే వారు సొంత మాట్స్ తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలని కోరారు. అయితే ‘హౌజ్’(చేతులు, కాళ్లు కడుక్కునే చోటు)ను మూసే ఉంచారు. ఫేమస్ ఛతర్​పూర్ టెంపుల్ కాంప్లెక్స్ 8.45కి ఓపెన్ అయింది. తొలి గంటలో 300 మంది భక్తులు వచ్చారు. ప్రసాదాలు, పూలకు పర్మిషన్ ఇవ్వలేదు.

ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు మహారాష్ర్టలో అనుమతి ఇవ్వలేదు. కరోనా కేసులు దేశంలో అత్యధికంగా ఇక్కడే నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 శాతం ఉద్యోగులతో పని చేసుకునేందుకు ప్రైవేటు ఆఫీసులకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై, ట్రాన్స్​పోర్ట్ (బెస్ట్) బస్సులు సోమవారం రోడ్డెక్కాయి. ప్రతి బస్సులో 30 మంది కూర్చుని, ఐదుగురు నిలబడి వెళ్లొచ్చు. ఇక రెడ్ జోన్లు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పుణె, నాసిక్, నాగపూర్​లలో షాపులు, ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్​మెంట్లు ఉదయం నుంచే తెరుచుకున్నాయి. గుళ్లు, మసీదులు, చర్చిలు ఎక్కడా తెరుచుకోలేదు.

తమిళనాడులో ప్రార్థనాస్థలాలను మూసే ఉంచారు. రెస్టారెంట్లు మాత్రం ఓపెన్ అయ్యాయి. ఇందుకోసం ఎన్‌​వోసీ జారీ చేసిన సర్కారు.. ఏసీలను వాడొద్దని ఆదేశించింది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే కస్టమర్లను అనుమతించాలి. 50 శాతం కెపాసిటీతోనే నడపాలి. ప్రతి చైర్, టేబుల్​ను యూసేజ్ తర్వాత డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. రాష్ర్టంలో 50 వేల రెస్టారెంట్లు ఉండగా, ఒక్క చెన్నైలోనే 20 వేల వరకు ఉన్నాయి.

కొన్ని షరతులతో ప్రార్థనా స్థలాలను కర్నాటక తెరిచింది. ప్రస్తుతానికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం లేదని అధికారులు చెప్పారు. దర్శనానికి మాత్రమే పర్మిషన్ ఉందని, ఆర్జిత సేవలు ప్రస్తుతానికి ఉండవని తెలిపారు. మసీదులు కూడా తెరుచుకోగా.. ఈనెల 13 వరకు చర్చిలు క్లోజ్​లోనే ఉండనున్నాయి. రెస్టారెంట్లలో డైన్ ఇన్​కు కూడా అనుమతి ఇచ్చారు. ప్రజలు రెస్టారెంట్లలో ఓ మోస్తరుగా కనిపించారు.

షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఇతర సంస్థలు వెస్ట్​బెంగాల్​లో ఓపెన్ అయ్యాయి.

ఉత్తరాఖండ్​లోని చాలా వరకు ఆలయాలు తెరుచుకున్నాయి. అయితే ‘చార్​ధామ్’ మాత్రం క్లోజ్​లోనే ఉండనుంది. డెహ్రాడూన్ మున్సిపల్ ఏరియాలోని ప్రార్థనా స్థలాలు కూడా మూసి ఉండనున్నాయి. చార్​ధామ్​పై ఒకటీ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు.

ఈనెల 30 వరకు ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లను మూసి ఉంచుతామని ఒడిశా సర్కార్​ ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి హోమ్ డెలివరీ మాత్రం కొనసాగుతుందని తెలిపింది. పూరిలోని జగన్నాథ దేవాలయాన్ని జులై 5 వరకు మూసివేస్తున్నట్టు ఇంతకుముందే ప్రకటించింది. ఈస్ట్​కోస్ట్ రైల్వే, ఒడిశా ఆర్టీసీ మాత్రం రాష్ట్ర పరిధిలో పరిమిత సంఖ్యలో రైళ్లు, బస్సు సర్వీసుల్ని ప్రారంభించింది.

కేరళలో ప్రభుత్వ ఆఫీసులు పూర్తిగా తెరుచుకున్నాయి. కంటెయిన్​మెంట్ జోన్లలో మాత్రం తక్కువ సిబ్బందితో నడుస్తున్నాయి.

కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్​డౌన్​ను రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్టు మిజోరాం ప్రకటించింది. క్వారంటైన్ గడువును 21 రోజులకు పెంచినట్టు తెలిపింది.

స్మారక స్థలాలు క్లోజ్​లోనే..

ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన స్మారక స్థలాలు క్లోజ్​లోనే ఉన్నాయి. అక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయన్న కారణంతో స్థానిక ప్రభుత్వాలు వాటిని మూసే ఉంచాయి. రాజస్థాన్, మహారాష్ర్ట, తమిళనాడు, ఒడిశా, జమ్మూకాశ్మీర్​లలో మోనుమెంట్స్ క్లోజ్​లోనే ఉంచారు. మహారాష్ర్టలో 65, రాజస్థాన్​లో 28, ఒడిశాలో 46, తమిళనాడులో 75, జమ్మూకాశ్మీర్​లో 9 స్మారక స్థలాలు ఉన్నాయి. ఆగ్రాలోని 14 మోనుమెంట్స్ కూడా తెరుచుకోలేదు.

ఒక్కటే టేబుల్‌.. నాలుగు భాగాలు

హోటల్స్‌సోమవారం తెరుచుకున్నాయ్‌. రూల్స్‌ప్రకారం కొన్ని హోటల్స్‌ఫిజికల్‌డిస్టెన్స్‌అమలు చేయడం మొదలుపెట్టాయి. బెంగళూర్‌లోని ఓ హోటల్‌లో ఒక టేబుల్‌వద్ద నలుగురు కూర్చునే విధంగా ఇలా ప్లాస్టిక్‌పార్టిషన్లు ఏర్పాటు చేశారు.

For More News..

కొడుకు ప్రేమిస్తే.. తండ్రిని చంపేశారు