
- అధికారుల దాడులతో వెలుగులోకి అక్రమాలు
- ఆరు పరిశ్రమల ఆర్డర్లు రద్దు
సిరిసిల్ల, వెలుగు: బతుకమ్మ చీరల తయారీలో అక్రమాలు బయటపడ్డాయి . నాసిరకం నూలుతో చీరలు తయారు చేయాలని చూసిన కొందరి వ్యవహారం అధికారుల తనిఖీలతో బట్టబయలైంది. సిరిసిల్లకు చెందిన కొంతమంది అధికార పార్టీ నేతలు, వస్త్ర పరిశ్రమల వ్యాపారులు కుమ్మక్కై నాసి రకం నూలుతో బతుకమ్మ చీరల తయారీకి ప్లాన్ చేశారు. ఈవిషయమై ఫిర్యాదులు అందడంతో చేనేత జౌళిశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. నూలును పరిశీలిం చి ఆరు పరిశ్రమలకు నోటీసులిచ్చారు. మరో రెండు పరిశ్రమల యజమాని, అధికార పార్టీ స్థానిక నేత నోటీసులు తీసుకోలేదు. అక్రమాలపై అధికారులు చేనేత జౌళిశాఖ డైరెక్టర్ శైలజరామయ్యర్‌కు నివేదిక ఇచ్చారు. ఆమె ఆదేశాల మేరకు జౌళిశాఖ ఏడీ అశోక్‌రావు ఆయా పరిశ్రమలకిచ్చిన ఆర్డర్లను రద్దు చేయడంతోపాటు వాటిని బ్లాక్ లిస్టులో చేర్చారు. అక్రమాలకు పాల్పడిన పరిశ్రమలపై క్రిమినల్ కేసులకు సిఫారస్ చేస్తామని వెల్లడించారు.