కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి రోజు ఆట 35 ఓవర్లు మాత్రమే సాగగా.. రెండు, మూడు రోజులు బంతి పడకుండానే తుడిచి పెట్టుకుపోయాయి. తడి ఔట్ ఫీల్డ్, సరైన డ్రైనేజీ సిస్టం లేకపోవడం వంటివి కూడా మ్యాచ్ జరగకపోవడానికి కారణాలు. ఎట్టకేలకు రెండ్రోజుల సుదీర్ఘ విరామం అనంతరం రెండో టెస్ట్ ఆట ప్రారంభమైంది.
వంద శాతం 'డ్రా'..!
ఇప్పటికే మూడు రోజులు గడిచిపోవడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం అనేది దాదాపు అసాధ్యం. ఎంత మిరాకిల్ జరిగినా ఇరు జట్లు రెండు ఇన్నింగ్స్‌లు పూర్తిచేయడమనేది కష్టంతో కూడుకున్న పనే. దాంతో, రెండో టెస్టు 'డ్రా' అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లపై ప్రభావం చూపనుంది.
డే 4 సెషన్ టైమింగ్స్(98 ఓవర్లు)
- ఫస్ట్ సెషన్: 9.30 గంటల నుంచి 11.45 వరకు
- లంచ్ బ్రేక్: 11.45 నుంచి 12.25 వరకు
- రెండో సెషన్: 12.25 నుంచి 2.40 వరకు
- టీ బ్రేక్: 2.40 నుంచి 3.00 వరకు
- మూడో సెషన్: 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
Good news from Kanpur as Day 4 will start on time with a minimum of 98 overs to be bowled.
— Cricbuzz (@cricbuzz) September 30, 2024
The first two sessions will be extended by 15 minutes.#INDvBAN pic.twitter.com/S1Jkv1JA6B