న్యూఢిల్లీ: బడ్జెట్ రోజు జరిగిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో మాత్రం వోలటాలిటీ కనిపించింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు డైరెక్ట్‌గా మేలు చేసే అంశాలేవి బడ్జెట్‌లో లేకపోవడంతో ఇండెక్స్‌లు పెద్దగా కదల్లేదు. కానీ, రూ. 12 లక్షల ఆదాయం వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ తొలగించడంతో వినియోగ ఆధారిత షేర్లు మాత్రం ర్యాలీ చేశాయి.
సెన్సెక్స్ శనివారం (ఫిబ్రవరీ 1) కేవలం 5.39 పాయింట్లే (0.01 శాతమే) పెరిగి 77,506 దగ్గర ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 23,482 దగ్గర సెటిలయ్యింది. ఇంట్రాడేలో మాత్రం 23,632 లెవెల్ దగ్గర గరిష్టాన్ని, 23,318 దగ్గర కనిష్టాన్ని నమోదు చేసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ అర శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం పెరిగింది. సెక్టార్ల పరంగా చూస్తే, బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ , కన్జూమర్ డిస్క్రిషనరీ, ఆటో, సర్వీసెస్, రియల్టీ ఇండెక్స్‌లు భారీగా పెరిగాయి.
మరోవైపు క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, పవర్, యుటిలిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, కమొడిటీస్ ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి. మార్కెట్ గత నాలుగు సెషన్లుగా లాభపడుతోంది. ఈ వారం సెన్సెక్స్ 1,315 పాయింట్లు (1.72 శాతం), నిఫ్టీ 390 పాయింట్లు పెరిగాయి.