Air Pollution: ఢిల్లీలో బాణసంచాపై శాశ్వత నిషేధం విధించాలి: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

Air Pollution: ఢిల్లీలో బాణసంచాపై శాశ్వత నిషేధం విధించాలి: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా నిషేధం కీలక వ్యాఖ్యలు చేసింది. నగరంలో బాణసంచా అమ్మకాలు, పేల్చడం ఆపడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశిం చింది. నవంబర్ 25 నాటికి ఢిల్లీలో బాణసంచాపై శాశ్వత నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 బాణసంచా పేల్చడంతో కెమికల్ వ్యర్థాలు విషపూరితమైన పొగమంచుతో కప్పబడి ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని,వారి ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 

ALSO READ | ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. ప్రతీ పది ఫ్యామిలీల్లో ఏడింటిపై ఎఫెక్ట్​

కాలుష్యాన్ని ఏమతమూ ప్రోత్సహించదు..ఈ తీరున బాణసంచా కాల్చితే అది పౌరుల ఆరోగ్యంపై, ప్రాథమిక హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ పిటిషన్ పై విచారణ సమయంలో వ్యాఖ్యానించింది. వి

చారణలో సమయంలో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులను మందలించింది. ప్రతి యేటా దీపావళి సమయంలో బాణసంచా నిషేధాన్ని అమలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.