జపాన్ లో బియ్యం లేవు.. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు.. ఎందుకంటే..?

జపాన్ లో బియ్యం లేవు.. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు.. ఎందుకంటే..?

జపాన్ దేశం వింత పరిస్థితులను ఎదుర్కొంటోంది. జనం నిత్యావసరం అయిన బియ్యం కొరత ఏర్పడింది. దేశంలోని 70 శాతం సూపర్ మార్కెట్లలో బియ్యం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో జనం కూడా భయాందోళనలకు గురవుతున్నారు. అరకొరగా ఉన్న స్టాక్ మొత్తాన్ని ఎగబడి కొనేస్తున్నారు. దీంతో మార్కెట్ లో బియ్యం కొరత మరింత పెరిగింది. అసలు జపాన్ దేశంలో బియ్యం కొరత ఎందుకు వచ్చింది అనేది వివరంగా తెలుసుకుందాం...

Also Read:-జన్ ధన్ యోజనకు పదేళ్లు

>>> జపాన్ దేశంలో గత ఏడాది కాలంగా తుఫాన్లను ఎదుర్కొన్నది. దీంతో 40 శాతం పంట దిగుబడి తగ్గిపోయింది. 
>>> కొత్త పంట మార్కెట్ లోకి రావటం 2024, సెప్టెంబర్ నెలాఖరు వరకు టైం పడుతుంది. 
>>> పాత బియ్యం స్టాక్ అనేది 40 శాతం తగ్గిపోవటం.. కొత్త బియ్యం రావటానికి మరో నెల రోజుల సమయం పడుతుండటంతో.. బియ్యం కొరత ఏర్పడింది. 
>>> ఇదే సమయంలో గత ఏడాది కాలంగా జపాన్ దేశానికి పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో బియ్యం వినియోగం కూడా పెరిగింది. దీని వల్ల కూడా కొరత ఏర్పడింది. 
>>> ఒక్కో కుటుంబానికి ఒక్కో బ్యాగ్ మాత్రమే అని కండీషన్ పెట్టారు వ్యాపారులు. ఈ ప్రకటనలతో జనంలో మరింత ఆందోళనలు పెరిగాయి. 
>>> బియ్యం అమ్మకాలపై వ్యాపారుల కండీషన్ తో బియ్యం కోసం ఎగబడ్డారు జనం.. దీంతో ధరలను అమాంతం పెంచారు.. 20 శాతం బియ్యం ధరలు పెంచి క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. అయినా వెనక్కి తగ్గని జనం.. మార్కెట్ లోకి వచ్చిన బ్యాగులను వచ్చినట్లు కొనేస్తున్నారు. 
>>> బియ్యం కొరత లేదని.. ప్రజల అవసరాలకు తగ్గట్టు నిల్వలు ఉన్నాయని.. భయాందోళనలు వద్దని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా.. జనంలో మాత్రం భయాలు పోవటం లేదు. 
>>> గత ఏడాది తుఫాన్లు, వాతావరణం కారణంగా 40 శాతం దిగుబడి తగ్గిన మాట వాస్తవమే అని.. మరో నెల రోజుల్లో కొత్త బియ్యం వస్తాయని భయం వద్దని చెబుతోంది జపాన్ సర్కార్. 
>>> జపాన్ దేశంలో బియ్యం కొరత మరో ఏడాది వరకు ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. ఈ ఏడాది కొత్తగా వరి సాగు విస్తీర్ణం పెరగలేదని.. దీనికితోడు వరదల కారణంగా ఈ ఏడాది కూడా బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు సైతం.. జపాన్ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 

ఏది ఏమైనా 1999 తర్వాత.. అంటే 25 ఏళ్ల తర్వాత జపాన్ దేశం బియ్యం కొరతను ఎదుర్కొంటుంది.