
న్యూఢిల్లీ: కొత్త సీఈసీ ఎంపికలో ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రీమెన్ కమిటీ ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘కాంగ్రెస్ పాలనలో ఎన్నికల కమిషనర్లను ఎలా నియమించారో రాహుల్ గాంధీ అప్పుడే మర్చిపోయారా? దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సెలక్షన్ మెకానిజాన్ని సంస్కరించడానికి ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు?” అని ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు.