‘గాంధీ’లో రెండు నెలలుగా జీతాల్లేవ్‌‌

‘గాంధీ’లో రెండు నెలలుగా జీతాల్లేవ్‌‌

ఎజైల్​ సంస్థపై లేబర్ ​ఆఫీసర్‌‌‌‌కు ఫిర్యాదు చేసిన కాంట్రాక్ట్‌‌ సిబ్బంది

పద్మారావునగర్, వెలుగు: తమకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఎజైల్‌‌ కాంట్రాక్ట్‌‌ ఏజెన్సీ ఇబ్బందులకు గురిచేస్తోందని కాంట్రాక్ట్‌‌, ఔట్‌‌సోర్సింగ్‌‌, పేషెంట్‌‌ కేర్‌‌‌‌, శానిటరీ, సెక్యూరిటీ స్టాఫ్‌‌ లేబర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌కు కంప్లైంట్‌‌ చేశారు. కరోనాకు ట్రీట్‌‌మెంట్‌‌ చేసే వార్డుల్లో డ్యూటీలు చేస్తున్నామని ఇన్సెంటివ్‌‌ల సంగతి పక్కనపెడితే కనీసం నెలనెలా జీతాలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్‌‌, ఈఎస్‌‌ఐ నెంబర్లు కూడా చెప్పడంలేదన్నారు. ఈ మేరకు తెలంగాణ యునైటెడ్‌‌ మెడికల్‌‌, హెల్త్‌‌ ఎంప్లాయీస్ యూనియన్‌‌ (సీఐటీయూ) గాంధీ యూనిట్‌‌ ప్రెసిడెంట్‌‌ కుమారస్వామి, జనరల్‌‌ సెక్రెటరీ సీ.హెచ్‌‌.లక్ష్మి లేబర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌కు ఫిర్యాదు అందజేశారు. క్వారంటైన్‌‌ లీవులు ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలను కాంట్రాక్ట్‌‌ సంస్థ అమలు చేయడం లేదని వాపోయారు.

For More News..

దసరా నుంచి కొత్త సెక్రటేరియట్ పనులు

తెలంగాణకు మళ్లీ నీళ్ల గాయం

అటు కరోనా.. ఇటు రెసిషన్.. పేదరికంలోకి 15 కోట్ల మంది