తాలిబన్ నేతలెవరో త్వరలో దునియాకు తెలుస్తది

తాలిబన్ నేతలెవరో త్వరలో దునియాకు తెలుస్తది

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దేశాన్ని తమ స్వాధీనం తెచ్చుకున్న తాలిబన్‌ ఫైటర్లు.. పలువురు కీలక నేతలతో చర్చిస్తున్నారు. అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ తోపాటు మరో కీలక నేత డాక్టర్‌ అబ్దుల్లా, ఫజల్‌ హది మస్లిమయర్‌ తదితర లీడర్లతో తాలిబన్‌ నేత ఆమిర్‌ఖాన్‌ ముత్తకీ చర్చలు కొనసాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో అంతర్గతంగా, బయట ఎలాంటి గొడవలు, ఘర్షణలకు చోటు ఇవ్వకూడదనేదే తమ అభిమతమని ఓ సీనియర్ తాలిబన్ ప్రతినిధి అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. తాము ప్రపంచం ముందు ఏమీ దాచట్లేదని.. తమ నేతలెవరో త్వరలోనే అందరికీ తెలుస్తుందని స్పష్టం చేశారు.