‘బాబ్రీ తీర్పు చెప్పిన జడ్జికి నో సెక్యూరిటీ’

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పిన రిటైర్డ్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ జడ్జి ఎస్‌‌‌‌కే యాదవ్‌‌‌‌కు సెక్యూరిటీని కొనసాగించేందుకు సుప్రీం కోర్టు నో చెప్పింది. తనకు సెక్యూరిటీ కంటిన్యూ చేయాలని యాదవ్‌‌‌‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సున్నితమైనదని, తనకు సెక్యూరిటీ పొడిగించాలని కోరారు. దీనిపై జస్టిస్‌‌‌‌లు నారిమన్‌‌‌‌, కృష్ణ మురారీ, నవీన్‌‌‌‌ సిన్హాలతో కూడిన బెంచ్‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టింది. “ ఒక్క లెటర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సెక్యూరిటీ కల్పించడం సరికాదు” అని బెంచ్‌‌‌‌ స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నేతలు ఎల్‌‌‌‌కే అడ్వాణీ, ఎంఎం జోషి, ఉమాభారతి సహా 32 మంది నిర్దోషులని యాదవ్‌‌‌‌ తీర్పు చెప్పారు. ఆయన రిటైర్‌‌‌‌‌‌‌‌ అయ్యే ముందు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 30న తీర్పు చెప్పారు.

For More News..

మూడేళ్ల పాప మూడు రోజులుగా శిథిలాల కిందే..

ఇడ్లీ సాంబార్ అంటే మస్త్ ఇష్టం.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి

చలికాలంలో న్యుమోనియాను అడ్డుకోండిలా..