డిగ్రీ, ఆపై కోర్సుల్లో.. ఫస్టియర్‌‌కు నో సెమిస్టర్!

డిగ్రీ, ఆపై కోర్సుల్లో.. ఫస్టియర్‌‌కు నో సెమిస్టర్!

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్​తో విద్యా రంగంలోని ఎగ్జామ్స్​ సిస్టమ్స్‌‌లో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్​ టైమ్‌‌తో పాటు క్వశ్చన్ పేపర్​ విధానంలో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించిన ఉన్నత విద్యామండలి, కొత్త అకడమిక్ ఇయర్‌‌లోనూ కీలక మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది. యూజీ, ఆపై కోర్సుల్లో ఫస్టియర్​లో సెమిస్టర్ విధానాన్ని ఎత్తేసే ఆలోచనలు చేస్తోంది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల అధికారులతో ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్​తో పాటు ఇతర ప్రొఫెషనల్ కాలేజీలన్నీ సెప్టెంబర్‌‌లో ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలకు యూజీసీ సూచించింది. రాష్ట్రంలో ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను జూన్ 20 నుంచి, మిగిలిన సెమిస్టర్​ ఎగ్జామ్స్‌‌ను జులై16 నుంచి ప్రారంభిస్తామనీ జేఎన్‌‌టీయూ ప్రకటించింది. డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా జూన్ 20 నుంచే ప్రారంభించుకోవాలని, మిగిలిన సెమిస్టర్స్​మాత్రం నవంబర్, డిసెంబర్‌‌లో నిర్వహించుకోవాలని ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి ఆగస్టులో ఫస్టియర్​మినహా మిగిలిన స్టూడెంట్లకు క్లాసులు నిర్వహించుకోవాలని వర్సీటీలు నిర్ణయించాయి. ఇంటర్నల్, ఎక్స్​టర్నల్​ఎగ్జామ్స్​నిర్వహణ కూడా కాలేజీలకే వర్సిటీలు అప్పగించాయి. దీంతో కొత్త  అకడమిక్ ఇయర్ లో ఏం చేద్దాం? అనేదానిపై చర్చలు సాగుతున్నాయి.

యానువల్ ఎగ్జామ్స్‌‌పై ఫోకస్

యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి కొత్త అకడమిక్ ఇయర్ ఏటా జులైలో ప్రారంభమవుతుంది. కానీ కరోనా ఎఫెక్ట్​తో 2020–21 అకడమిక్ ఇయర్‌‌ను సెప్టెంబర్ నుంచి ప్రారంభించాల్సి వస్తోంది. జనరల్‌‌గా డిసెంబర్​లోనే ఫస్ట్ సెమిస్టర్​ఎగ్జామ్స్​ఉంటాయి. సెప్టెంబర్‌‌లో అకడమిక్ ఇయర్​ప్రారంభమైతే, రెండు నెలల్లోనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం కష్టం. అందుకే ఫస్టియర్‌‌లో ఒక సెమిస్టర్ విధానాన్ని తొలగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఇంజినీరింగ్‌‌లో యాన్యువల్ ఎగ్జామ్స్ విధానమే ఉండేది. సెకండియర్ వారికి మాత్రమే సెమిస్టర్ విధానం అమలు చేసేవారు. ప్రస్తుతం అదేవిధానం ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీల్లో అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. సిలబస్‌‌నూ సాధ్యమైనంత వరకు తగ్గించాలని అనుకుంటున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి చెప్పారు. ఆయా అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

For More News..

టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ రేస్