యూరియాను రైతులకుఅందుబాటులో ఉంచండి: మంత్రి తుమ్మల ఆదేశాలు

యూరియాను రైతులకుఅందుబాటులో ఉంచండి: మంత్రి తుమ్మల ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రైతులకు యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. గురువారం సెక్రటేరియెట్ లో అగ్రికల్చర్ సెక్రటరీ రఘు నందన్ రావు, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్, కో ఆపరేటివ్, మార్క్ ఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ యాసంగి కోసం రాష్ట్రంలో 10.36 లక్షల టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటి వరకు 9. 21 లక్షల టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.08 లక్ష ల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొ న్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రానికి కావా ల్సిన ఎరువుల కోసం కేం ద్రంతో సంప్రదింపులు చేస్తున్నట్టు వివరించారు. దాదాపు 41వేల టన్నుల యూరియా రాష్ట్రానికి రానుం దని .. అంతే కాకుండా మరో 30వేల టన్నుల యూరియా సప్లై చేస్తున్నామని వెల్లడించారు.