Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..

Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..

పుష్ప-2 సినిమాకు ఎంత పాజిటివ్ బజ్ ఉందో నెగిటివిటీ కూడా సోషల్ మీడియాలో గట్టిగానే కనిపిస్తోంది. పుష్ప-2 సినిమా ఫలితం ఏదైనా తేడాగా ఉంటే అల్లు అర్జున్ను ఏకిపడేయడానికి ఓ శిబిరం రెడీగా ఉంది. ఈ పాజిటివిటీ, నెగిటివిటీ కాసేపు పక్కన పెడితే  తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 ఫీవర్ మాములుగా లేదు. 2024లో ఏ పెద్ద హీరో సినిమాకు కూడా ఇంత బజ్ రాలేదు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు పుష్ప సినిమా యూనిట్ మ్యాగ్జిమమ్ ట్రై చేస్తోంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేసింది. హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా పుష్ప-2 సినిమా గ్రాండ్గా ప్రీ రిలీజ్ఈవెంట్ జరుపుకుంటోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కల్చర్ మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోనో, దర్శకుడినో చీఫ్ గెస్ట్గా పిలవడం పరిపాటి. అంతెందుకు.. పుష్ప ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా స్పెషల్ గెస్ట్లుగా దర్శకులు రాజమౌళి, కొరటాల శివ హాజరయ్యారు. కానీ.. పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందుకు భిన్నంగా జరుగుతోంది. పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్లంటూ ఎవరినీ పిలవలేదని టాక్. సినిమా కంటెంట్లో స్టఫ్ ఉంటే టికెట్లు తెగడానికి ఏ చీఫ్ గెస్ట్ అవసరం లేదని పుష్ప-2 యూనిట్ భావించడమే ఇందుకు కారణం అని తెలిసింది. పుష్ప-2 సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ప్రతీ ప్రమోషన్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఒక్కడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. 

హైదరాబాద్లో జరుగుతున్న  ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా ఇండస్ట్రీ నుంచి ఏ పెద్ద హీరోను పిలవలేదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని, మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న వ్యతిరేకతకు ఇలా చెక్ పెట్టాలని పుష్ప టీం భావిస్తోందని వార్తలొచ్చినప్పటికీ అందులో నిజం లేదని సమాచారం. పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ హాజరుకావడం లేదని తెలిసింది. పుష్ప-2 సినిమా కంటెంట్పై కాన్ఫిడెన్స్తో అల్లు అర్జున్, పుష్ప మేకర్స్ ఇలా ముందుకెళుతున్నారు.

ALSO READ : Pushpa2 Bookings: బుకింగ్స్ తోనే అరాచకం.. రిలీజ్కు ముందే పుష్ప 2 ఊచకోత

తెలంగాణలో టికెట్ ధరలు భారీగా పెంచినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్పై ఆ ప్రభావం ఏమాత్రం పడకపోవడం పుష్ప-2 టీంకు మరింత బూస్ట్ ఇచ్చింది. హైదరాబాద్లో పుష్ప-2 అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికొస్తే.. డిసెంబర్ 5న థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయ్యే అవకాశం నూటికి 99 శాతం కనిపిస్తున్నాయి. ట్రైలర్ కు కూడా అంచనాలకు మించి రెస్పాన్స్ వచ్చింది. మంచికో, చెడుకో.. పుష్ప-2పై కొంత నెగిటివిటీ వచ్చింది. అయినా సరే.. సినిమాపై నమ్మకంతో పుష్ప--2 సినిమా యూనిట్ సోలోగానే దూసుకెళుతోంది.