1,412 బడుల్లో పిల్లలే లేరు

15 లోపు స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లు 6, 611
4,617 స్కూళ్లలో సింగిల్ టీచరే
2019-20 ఎన్ రోల్ మెంట్ వివరాలు వెల్లడించిన ఎంహెచ్ఆర్డీ

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టం లో జీరో ఎన్ రోల్ మెంట్ బడుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2019–20 అకాడమిక్ ఇయర్ లో ఏకంగా 1,412 స్కూళ్లలో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదు. దీంట్లో 1,097 ప్రైమరీ స్కూళ్లుండగా, 315 అప్పర్ ప్రైమరీ స్కూళ్లున్నాయి. ఆయా స్కూళ్లలోని టీచర్లను డిప్యూటేషన్ పై వేరే స్కూళ్లకు పంపించారు. తెలంగాణ స్టూడెంట్స్ 2019–20 ఎన్రోల్మెంట్ వివరాలను ఎంహెచ్ఆర్డీ గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తంగా 25 వేల బడులుండగా, వీటిలో 6,611 బడుల్లో 15 లోపు మంది స్టూడెంట్సే చదువుతున్నారు. గతేడాది ఈ సంఖ్య 5,982. 30 లోపు స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లు ప్రైమరీలో గతేడాది 10,603 ఉండగా, ఈసారి 11, 096 కు, యూపీఎస్లో 2,809 నుంచి 3,085 కు పెరిగాయి. 15 నుంచి 100 లోపు విద్యార్థులున్న స్కూళ్లు14,784 ఉండగా, 100 నుంచి 250 లోపు విద్యార్థులున్న స్కూళ్లు 2744 ఉన్నాయి. వెయ్యికి పైగా విద్యార్థులున్నస్కూల్ ఒక్కటే ఉంది.

4, 617 స్కూళ్లలోసింగిల్ టీచర్
రాష్ర్టంలో 4, 617 స్కూళ్లు సింగిల్ టీచర్ తోనే నడుస్తున్నాయి. వీటిలో ప్రైమరీ 4, 448 ఉండగా, యూపీఎస్లు 169 ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సింగిల్ టీచర్ స్కూల్స్ భారీగా పెరిగాయి. లాస్ట్ ఇయర్ సింగిల్ టీచర్ స్కూల్స్ 4,372 ప్రైమరీ స్కూళ్ల్లుండగా, యూపీఎస్ స్స్కూళలో 127 మాత్రమే ఉండేవి.

3 జిల్లాల్లో డ్రాపౌట్స్‌ ఎక్కువ
మూడుజిల్లా ల్లో 15శాతం కంటే ఎక్కువగాడ్రాపౌట్స్.
డైట్ కాలేజీల్లో 137పోస్టులు వెకెన్సీ.
16,433 మంది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రెన్స్ కు గానూ7986 మందిని మళ్లీ స్కూళ్లలో చేర్పించారు.

For More News..

ఇక నుంచి ఆర్టీసీ పెట్రోల్‌ బంకులు

ఆన్‌లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం

ప్రైవేటు స్కూల్స్ ఫీజులు దోచుకుంటుంటే సర్కార్‌ ఏం చేస్తోంది?