వ్యాక్సిన్ కావాలంటే సిరంజి తెచ్చుకోండి

వ్యాక్సిన్ కావాలంటే  సిరంజి తెచ్చుకోండి

మాస్ వ్యాక్సినేషన్ లో GHMC అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చంపాపేట డివిజన్ లోని వాక్సినేషన్ సెంటర్ లో సిరంజీలు లేవన్నారు అధికారులు. వ్యాక్సిన్ కావాలంటే సీరంజీ తెచ్చుకోమని సిబ్బంది చెప్పడంతో.. బయట మెడికల్ హాల్స్ నుంచి సిరంజీలు కొనుక్కుని తెచ్చుకున్నారు జనం. సిరంజీలు తెచ్చుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. 1500 మంది వ్యాక్సిన్ వేసే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు సిరంజీలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు. మరికొందరు గంటల తరబడి లైన్ లో నిలుచున్నా వ్యాక్సిన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.