ఎలక్ట్రిక్‌‌ బైకులకు నో ట్యాక్స్‌‌, నో రిజిస్ట్రేషన్‌‌ ఫీజు

  • మొదటి 2 లక్షల వెహికల్స్‌‌కే చాన్స్
  • జీవోలు రిలీజ్​ చేసిన రవాణా శాఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఇన్సెంటివ్స్‌‌‌‌ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రవాణా శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ సునీల్‌‌‌‌ శర్మ రెండు వేర్వేరు జీవోలు జారీ చేశారు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎనర్జీ పాలసీని రాష్ట్ర ఐటీ శాఖ ప్రకటించింది. అందులో ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ లిమిట్స్ లోకి వచ్చే పలు ప్రోత్సాహకాలను రవాణా శాఖ అమలు చేయనుంది. మొదటి 2లక్షల ఎలక్ట్రిక్‌‌‌‌ టూవీలర్స్‌‌‌‌ కొన్నవారికి రోడ్ ట్యాక్స్‌‌‌‌, రిజిస్ట్రేషన్‌‌‌‌ ఫీజు ఉండదని జీవోలో పేర్కొన్నారు. మొదటి 5 వేల ఎలక్ట్రికల్‌‌‌‌ ఫోర్‌‌‌‌ వీలర్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ ప్యాసింజర్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌కు, ఫస్ట్ 5 వేల ఎలక్ట్రిక్‌‌‌‌ ఫోర్‌‌‌‌ వీలర్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ కార్లకు, మొదటి 500 ఎలక్ట్రిక్‌‌‌‌ బస్సులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. మొదటి 20 వేల త్రీ సీటర్‌‌‌‌ ఆటోలకు రిజిస్ట్రేషన్‌‌‌‌ ఫీజు మినహాయింపు, మొదటి 5వేల బండ్లకు 15శాతం రెట్రో ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ఇన్సెంటివ్‌‌‌‌ ఇవ్వనున్నట్లు మరో జీవోలో పేర్కొన్నారు. ఫస్ట్‌‌‌‌ 10 వేల ఎలక్ట్రిక్‌‌‌‌ లైట్‌‌‌‌ గూడ్స్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌, ఎలక్ట్రిక్‌‌‌‌ త్రీ వీలర్‌‌‌‌ గూడ్స్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌తో పాటు ఎలక్ట్రిక్‌‌‌‌ ట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

పొల్యూషన్ తగ్గించాలనే: మంత్రి పువ్వాడ

పొల్యూషన్ కి అడ్డుకట్ట వేసేందుకే రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్ తయారీ, వాడకాన్ని ఎంకరేజ్ చేస్తోందని ట్రాన్స్ పోర్టు మంత్రి పువ్వాడ అజ‌‌‌‌య్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్పత్తిదారులు, వినియోగదారులకు స‌‌‌‌ద్వినియోగం చేసుకోవాల‌‌‌‌ని కోరారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ అండ్‌‌‌‌ ఎనర్జీ స్టోరేజ్ హబ్‌‌‌‌గా మార్చాలనే ప్రణాళికలో భాగంగా తాజా విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు.

For More News..

33 వేల మందికి ఒక్కడే డాక్టర్​.. ఇదీ మన ఆరోగ్యరంగం

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌

ఈ యాసంగి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్‌