రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ (సోమవారం) జరిగిన TRSLP సమావేశంలో మాట్లాడిన KCR… పార్టీకి నష్టం చేసే ఏ ఒక్కరినీ ఉపేక్షించబోయేది లేదని హెచ్చరించారు. ఇందులో భాగంగానే కొందరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వనని తేల్చిచెప్పారు.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో… బలం లేదని చెప్పినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టిందని తెలిప్పారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను TRS లో చేర్చుకోకూడదనే అనుకున్నామని అన్నారు. ఇవాళ ఉదయం కూడా మరో కాంగ్రెస్ ఎమ్యెల్యే తనతో మాట్లాడారని తెలిప్పారు సీఎం కేసీఆర్.