
చాలామందికి ఆఫీస్‌లో కనీసం కుర్చీలో నుంచి లేచి కాసేపు అటూ.. ఇటూ నడిచే టైం కూడా ఉండదు. అలాంటివాళ్లకు ఇది బెస్ట్ గాడ్జెట్. దీన్ని డెస్క్‌కింద పెట్టుకుని ఎక్స్‌ర్‌సైజ్ చేయొచ్చు. ఇది మినీ స్టెయిర్ స్టెప్పర్లా పనిచేస్తుంది. దీనికి ఉండే రెండు పెడల్స్ మీద రెండు కాళ్లు పెట్టి, సైకిల్ తొక్కినట్టు తొక్కుతూ ఉండాలి. నిల్చుని కూడా వర్కవుట్స్ చేయొచ్చు. దీనికి ఒక ఎల్‌సీడీ మానిటర్ కూడా ఉంటుంది. అందులో టైం, కౌంట్, కరిగిన క్యాలరీల లెక్క చూసుకోవచ్చు.
ఇందులో 8 రెసిస్టెన్స్ లెవల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఇంటెన్సిటీని కస్టమైజ్ చేసుకోవచ్చు. స్మూత్ గ్లైడింగ్ మోషన్‌తో పనిచేస్తుంది. అందువల్ల సైలెంట్‌గా దాని పని అది చేసుకుపోతుంది. పక్కవాళ్లకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది ఆఫీస్‌లోనే కాదు ఇంట్లో వర్కవుట్స్ చేసేవాళ్లకు కూడా బెస్ట్ ఛాయిస్. తక్కువ బరువు ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. డాల్ఫీ అనే కంపెనీ దీన్ని మార్కెట్లోకి తెచ్చింది.
ధర: 8,999 రూపాయలు