- సిటీలో ఏ జంక్షన్ లో చూసినా ఇదే పరిస్థితి
- మెయింటినెన్స్, రిపేర్లపై ఫోకస్చేయని జీహెచ్ఎంసీ
- మ్యానువల్‌గా ఆపరేట్ చేస్తున్న ట్రాఫిక్ వింగ్
- ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారుల ఇబ్బందులు
- వృథాగా ఉన్నా ఏడాదికి ఆరు కోట్లు ఖర్చు
హైదరాబాద్,వెలుగు: సిటీలో చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్పని చేయడం లేదు. మెయిన్జంక్షన్ల వద్ద ఆటోమెటిక్ సిగ్నల్స్ సిస్టమ్స్ కూడాస్విచ్ఛాఫ్అయ్యాయి. కొన్నేళ్ల కిందట వీటిని ఏర్పాటు చేయగా నిర్వహణ సరిగా లేకపోవడం, రిపేర్లకు వచ్చినా పట్టించుకోకపోవడంతోనే పరిస్థితి తలెత్తింది. మెయింటెనెన్స్కోసం ఏడాదికి కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తుంది. గ్రేటర్‌లో 221 చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయి. వీటిలో 50 శాతం సిగ్నల్స్‌లో ఆటోమెటిక్సిస్టమ్, మరో 30 శాతం సిగ్నల్స్సక్రమంగా పని చేయడం లేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణాలతో టైమ్‌కు గ్రీన్, రెడ్, ఆరెంజ్ లైట్లు వెలగని పరిస్థితి ఉంది. ప్యాట్నీ, కర్మాన్ ఘాట్, కొత్తపేట్, సాగర్ రింగ్ రోడ్డు, చాదర్‌ఘాట్, పెన్షన్ఆఫీసు, మాసబ్ ట్యాంక్, ట్యాంక్బండ్తదితర మెయిన్ఏరియాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్పనిచేయకపోవడంతో వాహనదారులు కన్ఫ్యూజ్అవుతుండగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. సిగ్నల్స్ప్రాబ్లమ్స్పై సిటిజన్స్ నుంచి కంప్లయింట్స్కూడా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు వెళ్తున్నాయి.
ఏడాదికి రూ.6 కోట్లు
సిటీలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్మస్ట్కాకున్నా ఏర్పాటు చేశారు. యూ టర్న్‌లు పెట్టడంతో పలు జంక్షన్లలో సిగ్నల్స్అవసరమే లేదు. మరికొన్ని చోట్ల అవసరం ఉన్నా వినియోగంలో లేవు. మెజార్టీ చౌరస్తాల్లో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మూడు నెలలకోసారి కోటిన్నర చొప్పున, ఏడాదికి రూ.6 కోట్లు నిర్వహణ వ్యయంగా ఏజేన్సీకి జీహెచ్‌ఎంసీ చెల్లిస్తోంది. సిగ్నల్స్ కరెంటు బిల్లుల భారం కూడా బల్దియానే భరిస్తోంది. కోట్లు ఖర్చు చేస్తున్నా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు.
ఉన్నవి వదిలేసి.. కొత్తగా ఏర్పాటు
ఉన్న వాటి నిర్వహణనే సరిగా పట్టించుకోవడం లేదు. మళ్లీ కొత్త సిగ్నల్స్ ని బల్దియా ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించి కాంట్రాక్టును గతేడాదే అప్పగించింది. కొత్తగా 155 సిగ్నల్స్‌తో పాటు 98 ఫెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు రూ.39.34 కోట్లను ఖర్చు చేస్తుంది. వీటి ఏర్పాటు అనంతరం తిరిగి మెయింటెనెన్స్ కోసం మళ్లీ అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఫోకస్ చేయని బల్దియా
ట్రాఫిక్ సిగ్నల్స్‌పై జీహెచ్ఎంసీ పెద్దగా ఫోకస్ చేయడం లేదు. దీంతో ఏజెన్సీ కూడా సిగ్నల్స్ రిపేర్లను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. సిగ్నల్స్ పై ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుంచి పోలీసులు కంప్లయింట్లు వెళ్తున్నా రిపేర్ చేయించడం లేదు. నడి రోడ్డుపై నిలుచొని మ్యానువల్‌గా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పరిస్థితి నెలకొంది. సీసీ కెమెరాలపై పెట్టిన దృష్టి కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టడం లేదని వాహనదారులు విమర్శిస్తున్నా రు. సిగ్నల్స్ వద్ద కొద్దిగా ముందుకొస్తేనే సిగ్నల్ జంప్ అంటూ ఫైన్లు వేస్తున్నారని, మరీ సిగ్నల్స్ పని చేయకపోతే ఎవరికి పెనాల్టీలు వేయాలని సిటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
For More News..