- తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం
ఖైరతాబాద్, వెలుగు: ప్రభుత్వం చేపట్టే సమగ్ర కుటుంబ సర్వేలో విశ్వబ్రాహ్మణులను విశ్వకర్మలుగా నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మను మయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. కృష్ణమాచారి ప్రభుత్వాన్ని కోరారు.
ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తప్ప అన్ని రాష్ట్రాలు తమకు విశ్వకర్మలుగా గుర్తింపునిచ్చారన్నారు. అలాగే సమగ్ర కుటుంబ సర్వేలో విశ్వకర్మలకు సంబంధించి ఐదు ఉపకులాలకు సైతం ప్రత్యేక కాలమ్ పెట్టాలని కోరారు.
సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు చారి, కోశాధికారి ఎం. శంకరాచారి, గౌరవ అధ్యక్షుడు కుందారం గణేశ్ చారి, ఎ. బాలాచారి పాల్గొన్నారు.