ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం..

ఉక్రెయిన్‎పై యుద్ధాన్ని నిరసిస్తూ రష్యాకు వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇదే సమయంలో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ రుబ్లెవ్ కూడా తమ దేశానికి గట్టి సందేశం ఇచ్చాడు. దుబాయ్‎లో జరుగుతున్న దుబాయ్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో పాల్గొన్న ఆండ్రీ.. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత.. తనను షూట్ చేస్తున్న కెమెరా వద్దకు వచ్చి.. నో వార్ ప్లీజ్ అంటూ కెమెరా గ్లాస్‎పై రాశారు. 

ఉక్రెయిన్‎పై యుద్ధాన్ని రష్యా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. రష్యాలో వేల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. పుతిన్‎కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు 850 మందిని రష్యా భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

అటు అమెరికాలోని టైమ్ స్క్వేర్ దగ్గర ఉక్రెయిన్‎కు మద్దతుగా పెద్ద ర్యాలీ తీశారు. అమెరికన్లు, ఉక్రెయిన్‎కు చెందిన ప్రజలు.. కార్లకు ఉక్రెయిన్ జెండాలు పెట్టి భారీ ర్యాలీ తీశారు. రష్యా.. ఉక్రెయిన్‎పై యుద్ధం ఆపాలని డిమాండ్ చేశారు. 

ఆస్ట్రియా రాజధాని వియన్నాలోనూ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఉక్రెయిన్‎పై రష్యా వార్ ఆపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉక్రెయిన్ జెండాలతో పుతిన్‎కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉక్రెయిన్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందన్నారు.

జార్జియా రాజధాని టిబిలిసిలో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్‎కు మద్దతుగా నినాదాలు చేశారు. మేమంతా మీ కోసం ఇక్కడ ప్రార్థిస్తున్నామని చెప్పారు. జార్జియాలోని రష్యా అనుకూల ప్రభుత్వం ఉక్రెయిన్‎కు మద్దతు ఇవ్వొద్దని నిర్ణయించిందని.. కానీ మేమంతా ఉక్రెయిన్‎కు సహాయం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.
 

For More News..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: ఫోటో గ్యాలరీ