అమెరికా, యూఎస్‌ఏ వేదికగా జరిగే ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే 20 జట్లలో 17 జట్లు ఈ నెల 27 నుంచి జూన్1 వరకు వామప్ మ్యాచ్‌లు ఆడుతాయని ఐసీసీ వెల్లడించింది. మొత్తం 16 వామప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 29న సౌతాఫ్రికా ఫ్లోరిడాలో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుండగా.. భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడనున్నాయి.
భారత్ బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆతిథ్య విండీస్ జట్టు జూన్ 30న ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అయితే డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ప్రాక్టీస్ లేకుండా నేరుగా మెయిన్ టోర్నీలో బరిలోకి దిగనున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ వామప్ మ్యాచ్ ల్లో ఈ మూడు దేశాలు మినహాయిస్తే మిగిలిన దేశాలన్నీ కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నాయి.
పాకిస్థాన్, ఇంగ్లాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడకపోవడానికి కారణం లేకపోలేదు. ఇరు జట్లు కూడా వరల్డ్ కప్ కు ముందు నాలుగు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ఆడనున్నాయి. మే 22 నుంచి మే 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. జూన్ 30 న ఫైనల్ తో ఈ పొట్టి సమరం ముగుస్తుంది.
టీ20 వరల్డ్ కప్ కు ముందు 16 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్
సోమవారం, 27 మే
కెనడా v నేపాల్, గ్రాండ్ ప్రైరీ క్రికెట్ స్టేడియం, గ్రాండ్ ప్రైరీ, టెక్సాస్
ఒమన్ v పాపువా న్యూ గినియా, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో
నమీబియా v ఉగాండా, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్ మరియు టొబాగో
మంగళవారం, 28 మే
శ్రీలంక v నెదర్లాండ్స్, బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, బ్రోవార్డ్ కౌంటీ, ఫ్లోరిడా
బంగ్లాదేశ్ v USA, గ్రాండ్ ప్రైరీ క్రికెట్ స్టేడియం, గ్రాండ్ ప్రైరీ, టెక్సాస్
ఆస్ట్రేలియా v నమీబియా, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్ మరియు టొబాగో
బుధవారం, 29 మే
దక్షిణాఫ్రికా ఇంట్రా-స్క్వాడ్, బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, బ్రోవార్డ్ కౌంటీ, ఫ్లోరిడా
ఆఫ్ఘనిస్తాన్ v ఒమన్, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్ మరియు టొబాగో
గురువారం, 30 మే
నేపాల్ v USA, గ్రాండ్ ప్రైరీ క్రికెట్ స్టేడియం, గ్రాండ్ ప్రైరీ, టెక్సాస్
స్కాట్లాండ్ v ఉగాండా, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్ మరియు టొబాగో నెదర్లాండ్స్
v కెనడా, గ్రాండ్ ప్రైరీ క్రికెట్ స్టేడియం, గ్రాండ్ ప్రైరీ, టెక్సాస్
నమీబియా v పాపువా న్యూ గినియా, ట్రినిడా క్రికెట్ అకాడమీ, బ్రియాన్ లారాడా క్రికెట్ అకాడమీ, మరియు టొబాగో
వెస్టిండీస్ v ఆస్ట్రేలియా, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్ మరియు టొబాగో
శుక్రవారం, 31 మే
ఐర్లాండ్ v శ్రీలంక, బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, బ్రోవార్డ్ కౌంటీ, ఫ్లోరిడా
స్కాట్లాండ్ v ఆఫ్ఘనిస్తాన్, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్ మరియు టొబాగో
శనివారం, 1 జూన్
బంగ్లాదేశ్ v ఇండియా, వేదిక TBC USA
India will play only one warm-up match -- against Bangladesh on June 1.
— India Today Sports (@ITGDsports) May 16, 2024
No warm-up matches for Pakistan, England and New Zealand ahead of T20 World Cup.#T20WorldCup2024 #Cricket #TeamIndia https://t.co/G57H8pWHt7