హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో సోమవారం( నవంబర్ 11) వాటర్​ సప్లయ్ బంద్

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీకి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2లోని మెయిన్​పంపింగ్​లైన్​కు భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వాటర్​బోర్డు అధికారులు సోమవారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు రిపేర్లు చేప‌ట్టనున్నారు. ఈ నేపథ్యంలో సిటీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్​అవుతుందని అధికారులు తెలిపారు.

ఆర్సీపురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతిన‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్, -బీరంగూడ‌, అమీన్ పూర్, ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2 ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్షన్లు, ఎర్రగ‌డ్డ, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట, - కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, మూసాపేట, జ‌గ‌ద్గిరిగుట్ట ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వెల్లడించారు.